లాక్‌డౌన్ ను పొడిగించడం లేదని ఆరోగ్యశాఖ మంత్రి కీలక ప్రకటన

Coronavirus, Coronavirus news live updates, Delhi Health Minister Satyendra, Lockdown Will Not Be Extended, Lockdown won’t be extended in Delhi

దేశ రాజధాని ఢిల్లీలో కరోనావైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఇప్పటికే 34,687 కరోనా కేసులు నమోదవగా, 12731 మంది కోలుకున్నారు, 1085 మంది మరణించారు. ప్రస్తుతం 20,871 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. మరోవైపు జూలై నెల చివరి నాటికీ ఢిల్లీలో దాదాపు 5.5 లక్షల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నామని ఇటీవలే ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా ఇటీవలే వెల్లడించారు.

ఈ నేపథ్యంలో ఢిల్లీలో కేసులు పెరుగుతుండడంతో మళ్ళీ జూన్ 15 నుంచి జూలై 31 వరకు లాక్‌డౌన్ ను పొడిగిస్తునట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంపై ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ స్పందిస్తూ ఢిల్లీలో లాక్‌డౌన్ ను పొడిగించడం లేదంటూ స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu