ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా వ్యాక్సిన్ల ధరలు ఇవే, కేంద్రం నిర్ణయం

Centre releases revised prices of Covaxin, Centre Releases Revised Prices of Covaxin Covishield Sputnik Covid Vaccines, Centre Releases Revised Prices of Covaxin Covishield Sputnik Covid Vaccines at PVT Hospitals, Centre Releases Revised Prices of Covid Vaccines, Centre releases revised prices of Covishield, Covid Live News Updates, Covid Vaccination Guidelines, Covid vaccination Prices, Covid vaccination Prices in private hospitals, Mango News, National Vaccination Policy, PVT Hospitals

దేశంలో 18 సంవత్సరాలు పైబడినవారందరికీ కరోనా వ్యాక్సిన్ వేసేందుకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా వ్యాక్సిన్లను అందజేయనున్నట్టు కేంద్రం ఇటీవలే ప్రకటించింది. దేశంలో నెలవారీగా ఉత్పత్తి అయ్యే కరోనా వ్యాక్సిన్లలో 75 శాతం కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయనుండగా, 25% ప్రైవేటుకు ఇచ్చేలా నిర్ణయించారు. అలాగే ప్రైవేట్ ఆసుపత్రులు సర్వీస్ ఛార్జీ కింద ఒక్కో డోసుకు గరిష్టంగా రూ.150 వరకు వసూలు చేయవచ్చని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వ్యాక్సిన్ ధరలను మంగళవారం నాడు కేంద్రం నిర్ణయించింది. నేషనల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద దేశంలో ప్రస్తుతం కొవిషీల్డ్‌, కొవాగ్జిన్, స్పుత్నిక్-వీ వంటి మూడు కరోనా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

ప్రైవేట్ ఆసుపత్రులలో కరోనా వ్యాక్సిన్ల ఒక్కో డోసు ధరలు:

  • కొవిషీల్డ్‌ వ్యాక్సిన్ : 600 (సంస్థ నిర్ణయించిన ధర) + 30 (జీఎస్టీ 5%) + 150 (గరిష్ట సర్వీస్ చార్జీ) = రూ.780
  • కొవాగ్జిన్ వ్యాక్సిన్ : 1200 (సంస్థ నిర్ణయించిన ధర) + 60 (జీఎస్టీ 5%) + 150 (గరిష్ట సర్వీస్ చార్జీ) = రూ.1410
  • స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ : 948 (సంస్థ నిర్ణయించిన ధర) + 47.40 ~ 47 (జీఎస్టీ 5%) + 150 (గరిష్ట సర్వీస్ చార్జీ) = రూ.1145

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 9 =