ఏపీలో ఉద్యోగ అర్హత వయసు గడువు పొడిగీస్తూ జీవో జారీ

AP Govt Issued GO on Age Limit Extension Deadline

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన 42 ఏళ్ల అర్హత వయస్సు గడువును సెప్టెంబర్ 30, 2021 వరకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు జీవో 52ను జూన్ 17, బుధవారం నాడు ప్రభుత్వం జారీ చేసింది. అర్హత వయస్సుకు సంబంధించి గతంలో జారీ చేసిన జీవో గడువు 2019 సెప్టెంబర్ 30 తో ముగియడంతో మరోసారి పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీపీఎస్సి సహా ఇతర ప్రభుత్వ ఏజెన్సీల నియామకాల్లో ఈ గడువు పెంపును వర్తింపజేయనున్నారు. అలాగే యూనిఫారం సర్వీసులైన వివిధ కేటగిరీల పోస్టుల వయో పరిమితి పెంపు జీవోను కూడా 2021 సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu