ఏపీని నార్కోటిక్స్ ఫ్రీ స్టేట్‌గా మార్చాలి – ఎక్సైజ్‌, ఎస్‌ఈబీపై సమీక్షలో సీఎం జగన్ కీలక ఆదేశం

CM Jagan Held Review on Excise and SEB Directs Officials AP Should Become Narcotics Free State,AP should narcotics free state,CM Jagan key order to Excise,Andhra Pradesh SEB,Special Enforcement Bureau,Mango News,Mango News Telugu,Special Enforcement Bureau AP,AP Special Enforcement Bureau,AP SEB,Special Enforcement Bureau Latest News and Updates,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy,YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

ఆంధ్రప్రదేశ్‌ను ‘నార్కోటిక్స్ ఫ్రీ స్టేట్‌’గా మార్చాలని ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన ఏపీ ఎక్సైజ్‌ మరియు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ)పై నిర్వహించిన సమీక్షలో భాగంగా పలు కీలక సూచనలు చేశారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మరియు ఏపీ ఎక్సైజ్‌ మినిష్టర్ నారాయణ స్వామి, హోంమంత్రి తానేటి వనిత, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ భార్గవ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

ఎక్సైజ్‌, ఎస్‌ఈబీపై సమీక్షలో సీఎం జగన్ చేసిన పలు కీలక సూచనలు, ఆదేశాలు..

  • ఏపీలో ఎక్కడా నార్కోటిక్స్ వినియోగం ఉండరాదు. ఇదే లక్ష్యంతో పోలీస్ మరియు ఎక్సైజ్‌ శాఖలు కలిసి పనిచేయాలి.
  • నార్కోటిక్స్ సహా అక్రమ మద్యంపై కూడా దృష్టి సారించి పూర్తిగా అరికట్టాలి.
  • అలాగే సచివాలయాలలో మహిళా పోలీసుల పనితీరు మెరుగు పరిచేలా చర్యలు చేపట్టాలి.
  • రాష్ట్రంలో మహిళల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన దిశ చట్టం మరియు దిశ యాప్‌లు మరింత పక్కాగా అమలయ్యేలా చూడాలి.
  • దిశ యాప్ వినియోగం, కాల్స్, సత్వర స్పందనపై అన్ని చోట్ల మాక్ డ్రిల్స్ నిర్వహించి మహిళలకు అవగాహన కల్పించాలి.
  • ప్రతి మంగళవారం సమన్వయ సమావేశం నిర్వహించి మరింత సమర్థవంతంగా పనిచేయాలి.
  • రాష్ట్రంలో అక్రమ మద్యం నియంత్రణ, గంజాయి సాగును అరికట్టేందుకు ఎస్‌ఈబీ, ఎక్సైజ్ అధికారులు తీసుకుంటున్న చర్యలను సమీక్షించాలి.
  • విద్యార్థులు నార్కోటిక్స్ వినియోగించకుండా నిరోధించాలి. దీనికోసం అన్ని కాలేజీలు, యూనివర్శిటీల వద్ద అవగాహన కల్పిస్తూ పెద్ద ఎత్తున హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలి.
  • అలాగే దీనికోసం ఏర్పాటు చేసిన ఎస్‌ఈబీ ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్‌ 14500 ను హోర్డింగ్స్ లో ప్రదర్శించాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × two =