మరో సీనియర్ కాంగ్రెస్ నాయకుడికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

Abhishek Manu Singhvi Coronavirus, Abhishek Manu Singhvi Covid-19, Abhishek Manu Singhvi Tested Positive for Covid-19, Congress Senior Leader, Congress Senior Leader Abhishek Manu Singhvi, Coronavirus, India Coronavirus Updates

దేశంలో రోజురోజుకి కరోనా వైరస్ ప్రభావం మరింతగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీల కీలక నాయకులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అభిషేక్‌ మను సింఘ్వి కి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా పాజిటివ్ గా తేలడంతో ఆయన స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లినట్టు తెలుస్తుంది. కాగా ఆయనకు కరోనా వైరస్‌ లక్షణాలు స్వల్పంగానే ఉన్నట్టు సమాచారం. దీంతో సింఘ్వి కుటుంబ సభ్యులు, కార్యాలయ సిబ్బందికి కూడా కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. మరోవైపు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్రజైన్‌ కరోనా నుంచి కోలుకున్నారు. శుక్రవారం నాడు ఆయనకు మరోసారి పరీక్షలు నిర్వహించగా ఫలితం నెగిటివ్‌గా వచ్చింది. దీంతో ఆయన ఆసుపత్రి నుంచి డిశార్జ్‌ అయ్యారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu