ముంబైలో స్వైన్ ఫ్లూ కలకలం.. 15 రోజుల్లో 130కి పైగా కేసులు నమోదు

BMC Confirms More Than 130 Cases of Swine Flu Detected at Mumbai in Just 15 Days, 130 Cases of Swine Flu Detected at Mumbai in Just 15 Days, Swine Flu 130 Cases Detected at Mumbai in Just 15 Days, Mumbai Swine Flu Cases, Swine Flu Cases, Brihanmumbai Municipal Corporation, Swine Flu, 130 Cases, Mumbai, Mumbai Swine Flu Cases News, Mumbai Swine Flu Cases Latest News And Updates, Mumbai Swine Flu Cases Live Updates, Mango News, Mango News Telugu,

దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో స్వైన్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. అక్కడ రోజు రోజుకి స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. ఈ మేరకు బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బిఎంసి) గత 15 రోజుల్లో 130కి పైగా కేసులు నమోదయ్యాయని ప్రకటించింది. దీనితోపాటుగా మలేరియా, డెంగ్యూ కేసులు కూడా అధికంగా నమోదయ్యాయని బిఎంసి అధికారులు తెలిపారు. అధికారుల లెక్కల ప్రకారం, ఆగస్టు 1 మరియు 14 మధ్య 138 స్వైన్ ఫ్లూ (హెచ్1ఎన్1) కొత్త కేసులు కనుగొనబడ్డాయి. అలాగే మలేరియా కేసులు 412, డెంగ్యూ కేసులు 73 వరకూ నమోదయ్యాయి. జూలై నెలలో ముంబై నగరంలో 105 స్వైన్ ఫ్లూ కేసులు నమోదవగా.. డెంగ్యూ 61 కేసులు, మలేరియా 563 కేసులు వరకు వచ్చాయని అధికారులు పేర్కొన్నారు.

అయితే గత నెలతో పోలిస్తే ఈ నెలలో అంటువ్యాధుల సంఖ్య భారీగా పెరిగిందని, దీనికి కారణాలపై అధ్యయనం చేస్తున్నామని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో.. వైద్యశాఖ అధికారులు ప్రజలకు కొన్ని కీలక సూచనలు చేస్తున్నారు. ఎవరికైనా జ్వరం, ఒళ్ళు నొప్పులు, గొంతులో మంటగా అనిపించడం, దగ్గు, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆస్పత్రికి వెళ్లి వైద్యులను కలవాలని సూచించారు. అలాగే కళ్ళు, ముక్కు, నోరు భాగాలను చేతులతో తాకవద్దని.. తరచుగా సబ్బుతో చేతులు కడుక్కోవాలని చెప్పారు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా జాగ్రత్తలు వహించాలని, చిన్న పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + twelve =