ఘోర రోడ్డు ప్రమాదం: ట్రక్కును ఢీకొన్న బస్సు, ఏడుగురు మృతి

7 killed in bus-truck collision in Raipur, Bus Collided With Truck, Bus-Truck Collision, Bus-Truck Collision in Chhattisgarh, Chhattisgarh, Chhattisgarh Bus Accident, Chhattisgarh Bus Accident News, Chhattisgarh Bus Accident Today, Chhattisgarh Bus Accident Updates, chhattisgarh bus truck accident, Chhattisgarh Bus-truck collision

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని రాయ్‌పుర్‌లో ఈ రోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒడిశాలోని గంజాం నుంచి గుజరాత్‌లోని సూరత్‌కు కూలీలను తీసుకెళ్తున్న బస్సు, రాయ్‌పూర్‌లోని చెరిఖేడ్‌ వద్ద ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురికి తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తుంది. ఈ సంఘటన జరిగిన వెంటనే స్థానిక పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ స్పందిస్తూ, గాయపడిన వారికీ మెరుగైన చికిత్స అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే బస్సు ప్రమాదంలో మరణించిన ఏడుగురు కూలీల కుటుంబాలకు రూ.2 లక్షలు పరిహారం ప్రకటించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu