నిమ్స్‌లో కోబాస్ 8800 యంత్రం ప్రారంభం, రోజుకు 4 వేల ఆర్టీపీసీఆర్ కరోనా పరీక్షలు చేసే అవకాశం

Cobas 8800 Machine at Nims Hospital, Cobas 8800 Machine at Nims Hospital For Corona Tests, cobas machine at nims, cobas® 8800 System, Eatala Rajender launches cobas 8800 system, Minister Etala Rajender, Minister Etala Rajender Inaugurated Cobas 8800 Machine at Nims, New machine at NIMS, Telangana Corona Cases, TS Coronavirus

కరోనా పరీక్షల నిర్వహణకు గాను హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన కోబాస్ 8800 యంత్రాన్ని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ ఆధునాతన కోబాస్ 8800 యంత్రం ద్వారా రోజుకు నాలుగు వేల ఆర్టీపీసీఆర్ కరోనా పరీక్షలు నిర్వహించవచ్చని తెలిపారు. రాష్ట్రంలో ఈ యంత్రం కొనుగోలుతో రోజుకు 20వేల ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేసే సామర్ధ్యానికి చేరుకున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్ర‌భుత్వ ఆసుపత్రుల్లో మౌలిక‌వ‌స‌తులను మెరుగుపరిచే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. అందులో భాగంగా పలు ఆసుపత్రుల్లో ఇప్ప‌టికే అనేక ‌ర‌కాల ప‌రిక‌రాల‌ను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. అలాగే తర్వలోనే ఈ కరోనా మహమ్మారి ప్రభావం తగ్గే అవకాశముందని మంత్రి ఆశాభావం వ్య‌క్తంచేశారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + nine =