రైలు ప్రయాణికులకు కేంద్ర రైల్వే శాఖ మరో శుభవార్త అందించింది. పండుగ సమయం దగ్గరకు వస్తుండడంతో కనెక్టివిటీ మరియు ప్యాసింజర్ సౌలభ్యాన్ని మెరుగుపరచడం కోసం దేశవ్యాప్తంగా 39 స్పెషల్ రైళ్లను ప్రారంభనున్నట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అనుకూలమైన తేదీ నుండి ఈ ప్రత్యేక రైళ్లను ప్రారంభించనున్నట్టు తెలిపారు. దేశంలో డిమాండ్‌కు అనుగుణంగా స్పెషల్ రైళ్ల సంఖ్యను పెంచనున్నట్టు తెలిపారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిలిచిపోయిన రైలు సేవలను కేంద్రం దశలవారీగా ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని ప్రత్యేక రూట్లలో రైళ్లకు గల భారీ డిమాండును పరిగణనలోకి స్పెషల్ రైళ్లును నడిపేందుకు రైల్వే శాఖ అనుమతి ఇస్తుంది. సెప్టెంబర్ 12 నుంచి కొత్తగా 80 ప్రత్యేక రైళ్లు, సెప్టెంబర్ 21 నుంచి 40 క్లోన్ స్పెషల్ రైళ్లను నడుపుతున్నారు. తాజాగా పండుగ నేపథ్యంలో 39 కొత్త రైళ్లను నడిపేందుకు జోన్లకు రైల్వే శాఖ అనుమతి ఇచ్చింది.
Enhancing Connectivity & Passenger Convenience: Railways to gradually start additional 39 pairs of trains across the country to enhance ease of movement as the festive season draws close.
The number of special trains will be increased to meet the demand. pic.twitter.com/DEphq57X2s
— Piyush Goyal (@PiyushGoyal) October 7, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu