భారీ వర్షాల నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ మహేందర్ రెడ్డి

#KCR, Heavy Rains In Telangana, Heavy Rains in the State, Indian Meteorological Department, telangana, Telangana CM KCR, Telangana DGP Mahender Reddy, Telangana DGP Mahender Reddy Alerts the Police, Telangana Floods Live Updates, Telangana On Alert After Heavy Rains, Telangana rains, telangana rains news, telangana rains updates

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న మూడు రోజులు భారీ వర్షాలున్నందున రాష్ట్రంలోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ల నుండి జిల్లా ఎస్పీలు, పోలీస్ కమీషనర్లందరూ అప్రమత్తంగా ఉండాలని డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలో పోలీస్ శాఖ మొత్తాన్ని డీజీపీ అప్రమత్తం చేశారు. పోలీస్ అధికారులందరూ 24 గంటల పాటు విధుల్లో ఉండి ప్రజలకు ఏవిధమైన అసౌకర్యం కలుగకుండా చూడాలని పేర్కొన్నారు.

ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, వరద తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్లు, విపత్తుల నివారణ శాఖ, ఇతర శాఖలతో సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రధానంగా డయల్ 100 కు వచ్చే కాల్స్ అన్నింటినీ ప్రాధాన్యతతో చేపట్టి పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఎక్కడ ఏవిధమైన ఇబ్బందులు ఎదురైనా డయల్ 100 కు ఫోన్ చేయాలని రాష్ట్ర ప్రజలను డీజీపీ మహేంద్రరెడ్డి కోరారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu