జీహెచ్‌ఎంసీ, పట్టణ ప్రాంతాల్లో ఆస్తి పన్నులో 50 శాతం రాయితీ

Fifty per cent Property Tax Relief in GHMC, Fifty per cent rebate on property tax, GHMC Property Tax, Mango News Telugu, Property Tax Relief in GHMC, Property Tax Relief in GHMC and Urban Areas, Telangana Announces 50% Waiver In Domestic Property Tax, Telangana Govt, Telangana Govt Announces Fifty per cent Property Tax Relief, Urban Areas

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కానుక అందించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు 2020-21 సంవత్సరానికి జీహెచ్‌ఎంసీ పరిధిలో మరియు పట్టణ ప్రాంతాల్లో ఆస్తి పన్నులో 50 శాతం రాయితీ కల్పిస్తున్నట్టు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ శనివారం నాడు ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.15 వేల వరకు ఆస్తి పన్ను ఉన్న వారికి 50 శాతం, అదేవిధంగా రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో రూ.10 వేల ఆస్తిపన్ను ఉన్న వారికి 50 శాతం రాయితీ కల్పిస్తున్నట్టు ప్రకటించారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మరోవైపు ఇప్పటికే ఆస్తి పన్ను చెల్లించిన ప్రజలకు వచ్చే సంవత్సరం చెల్లించాల్సిన మొత్తంలో మినహాయింపు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఆస్తిపన్ను రాయితీ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 31.40 లక్షల కుటుంబాలకు రూ.326.48 కోట్ల మేర లబ్ధి చేకూరుతుందని మంత్రి కేటిఆర్‌ వెల్లడించారు. రాయితీ మొత్తాన్ని ఆయా ప్రాంతాల స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ