బాధ్యతలు స్వీకరించిన కొత్త మంత్రులు

New ministers who took charge,New ministers charge,ministers who took charge,Ministers, Batti vikramarka, duddilla sridhar babu, CM Revanth reddy cabinet, Ponguleti srinivas reddy,Mango News,Mango News Telugu,Telangana Ministers Takes Charge,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Revanth Reddy Latest News,Telangana Ministers Latest News,Telangana Ministers Latest Updates
Ministers, Batti vikramarka, duddilla sridhar babu, CM Revanth reddy cabinet, Ponguleti srinivas reddy

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్‌లో ఇప్పటి వరకు 11 మందికి చోటు దక్కిన విషయం తెలిసిందే. వారిలో ఆరుగురు గురువారం మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్ మంత్రిత్వ శాఖల మంత్రిగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సబ్సిడీ రూ. 374 కోట్లను ఆర్టీసీకి విడుదల చేస్తూ భట్టి విక్రమార్క తొలి సంతకం చేశారు. ఇక రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని రూ. 10 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా రూ. 298 కోట్లను ఆరోగ్య శాఖకు విడుదల చేస్తూ రెండో సంతకం చేశారు.

అలాగే తెలంగాణ పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా దనసరి అనసూయ సీతక్క బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ ఐటీ, పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల మంత్రిగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు బాధ్యతలు చేపట్టారు. రెవెన్యూ మరియు హౌసింగ్, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ శాఖ మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. భువనగిరి జిల్లా రాయగిరిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి  పది ఎకరాల భూమిని కేటాయిస్తూ పొంగులేటి తొలి సంతకం చేశారు.

అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా దామోదర రాజనర్సింహా సచివాలయంలోని తమ ఛాంబర్లలో బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఆరుగురు మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. ఆరుగురు మంత్రులు బాధ్యతలు స్వీకరించడంతో.. కార్యకర్తలు, నాయకులు, అధికారులు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 5 =