ప్రస్తుతం హరిద్వార్ పర్యటనలో ఉన్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అక్టోబర్ 12, శనివారం ఉదయం పవిత్ర గంగా హారతిలో పాల్గొన్నారు. రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, భారతీయ నీటి సంరక్షణకారుడు, పర్యావరణవేత్త అయిన రాజేంద్రసింగ్ తో కలిసి ఈ గంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, గంగా నదిని ప్రక్షాళన చేసే కార్యక్రమానికి తన వంతు కృషి చేస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రజల నమ్మకాలను విశ్వాసాలను దృష్టిలో ఉంచుకుని నడుచుకుంటామని చెప్పారు.
అదే విధంగా అక్కడ ఉన్న స్థానికులతో గంగా నది కాలుష్యానికి గురయ్యే విధానం, గంగా నది ప్రక్షాళన కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. హరిద్వార్ ఆశ్రమంలో ఉన్న పవన్ కళ్యాణ్, అక్టోబర్ 11 శుక్రవారం నాడు పుణ్యక్షేత్రమైన రిషికేశ్ లో పవిత్ర గంగానదిని సందర్శించారు. అదే విధంగా గంగా నదిని ప్రక్షాళన కోసం ప్రాణాలు అర్పించిన గంగ పుత్రులు జ్ఞాన్ స్వరూప్ సనంద్ మొదటి వర్ధంతి సందర్భంగా భారత్ జాగృతి మిషన్ హరిద్వార్ లోని పవన్ ధామ్ లో స్వామి సహజ్ ప్రకాష్ అధ్యక్షన నిర్వహించిన కార్యక్రమానికి కూడ జనసేనాని పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.
[subscribe]



