తెలంగాణలో 3196 హెల్త్ కేర్ వర్కర్స్ కు రెండో డోస్ కరోనా వ్యాక్సిన్

Covid-19 Vaccination: 3196 HCWs were Vaccinated for 2nd Dose on Feb 13

తెలంగాణ రాష్ట్రంలో శనివారం నుంచి సెకండ్ డోస్ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం నాడు 3926 హెల్త్ కేర్ వర్కర్స్ కు సెకండ్ డోస్ వ్యాక్సిన్ వేసినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. శనివారం రాష్ట్రంలోని 3752 హెల్త్ కేర్‌ వర్కర్లకు సెకండ్ డోస్ వ్యాక్సిన్ ‌వేసేలా లక్ష్యంగా పెట్టుకోగా, అందులో 85.18 శాతం (3196) మందికి వ్యాక్సిన్ వేసినట్టు పేర్కొన్నారు. ఇక మళ్ళీ ఫిబ్రవరి 15, సోమవారం నుండి హెల్త్ కేర్ వర్కర్లకు సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ కొనసాగుతుందని చెప్పారు.

మరోవైపు 1111 మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్ కూడా శనివారం నాడు మొదటి డోస్ కరోనా వ్యాక్సిన్ ‌వేశారు. దీంతో తెలంగాణలో ఇప్పటికి 2,78,936 మంది లబ్ధిదారులకు(హెల్త్ కేర్, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు) మొదటి డోస్ కరోనా వ్యాక్సిన్ వేసినట్టు అయింది. అలాగే రెండో డోస్ వ్యాక్సినేషన్ పక్రియ మూడు వారాలపాటుగా కొనసాగించి, మార్చి రెండో‌వా‌రంలో 50 ఏళ్ళు పైబ‌డి‌న‌వా‌రికి, దీర్ఘ‌కా‌లిక వ్యాధు‌లతో బాధ‌ప‌డు‌తు‌న్న‌ ప్రజలకు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించేలా ఏరాట్లు చేస్తున్నట్లు వైద్యశాఖ అధికారులు వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ