కోవిడ్‌-19 పై పోరాటం: రూ.890.32 కోట్లు విడుదల చేసిన కేంద్రం

Centre Releases 890 Crores, Centre releases Rs 890 crore as second instalment, Coronavirus, COVID 19 Relief Package, covid 19 relief package in india, Covid-19 Package, covid-19 package relief, Second Instalment Of Covid-19 Package, Second Instalment Of Covid-19 Package to States

కోవిడ్‌-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్, ఆరోగ్య వ్యవస్థ సన్నద్ధత కోసం ప్రకటించిన ప్యాకేజీలో భాగంగా రెండో విడత ఆర్థికసాయాన్ని గురువారం నాడు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దేశంలోని 22 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు రూ.890.32 కోట్లను కేంద్రం విడుదల చేసింది. ఆయా రాష్ట్రాల్లో నమోదైన కరోనా కేసుల సంఖ్య ఆధారంగా ఈ సహాయం అందుతుంది. ఈ ఆర్ధిక సాయం పొందే రాష్ట్రాలు/కేంద్ర పాలిట ప్రాంతాలలో ఛత్తీస్‌ గడ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గోవా, గుజరాత్, కర్ణాటక, కేరళ, పంజాబ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ అండ్ డయు, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, మరియు సిక్కిం ఉన్నాయి.

‘సంపూర్ణ ప్రభుత్వ బాధ్యత’ కింద రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో కోవిడ్‌ మహమ్మారి నివారణకు కేంద్ర ప్రభుత్వం సాంకేతిక మరియు ఆర్థిక వనరులతో సహాయం అందిస్తుంది. అందుకు అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. ఇందులో తొలి విడత నిధులతో పరీక్షల, ఆస్పత్రుల మౌలిక వసతులను పెంచడానికి, రోజువారీ అత్యవసర కార్యకలాపాల నిర్వహణకు, అవసరమైన పరికరాలు-మందులు, ఇతర సామగ్రి సమకూర్చుకోవడానికి వీలుగా అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రభుత్వాలకు కేంద్రం రూ.3,000 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా 5,80,342 ఐసొలేషన్ బెడ్స్, 1,36,068 ఆక్సిజెన్ బెడ్స్, 31,255 ఐసీయూ బెడ్స్ సదుపాయాలు సమకూర్చబడ్డాయి. అంతేకాకుండా 86,88,357 పరీక్ష కిట్లు, 79,88,366 వయల్‌ ట్రాన్స్ పోర్ట్ మీడియా (వీటీఎం) లను కొనుగోలు చేశారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 14 =