రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 28, ఆదివారం నుండి రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ (రాత్రిపూట కర్ఫ్యూ) అమలు చేయాలని సీఎం ఉద్ధవ్ థాకరే అధికారులను ఆదేశించారు. శుక్రవారం నాడు జిల్లా కలెక్టర్లు, డివిజనల్ కమిషనర్లుతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై సమీక్షించిన అనంతరం నైట్ కర్ఫ్యూ విధించాలని సీఎం ఉద్ధవ్ థాకరే నిర్ణయం తీసుకున్నారు. అలాగే రాష్ట్రంలోని షాపింగ్ మాల్స్ రాత్రి 8 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మూసివేయాలని ఆదేశాలు ఇచ్చారు.
ప్రజలు కరోనా నిబంధనలు పాటించకపోతే మరింత కఠినమైన విధానాలు అమలుచేయాల్సి వస్తుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ ఉండదని, అలాంటి పరిస్థితి వస్తే ప్రజలకు ముందస్తుగా సమాచారం ఇవ్వనున్నట్టు తెలిపారు. కరోనా కేసులను బట్టి జిల్లా స్థాయిల్లో లాక్‌డౌన్ ఎప్పుడు విధించాలో జిల్లాస్థాయి అధికారులు నిర్ణయం తీసుకుంటారని సీఎం తెలిపారు. మరోవైపు మహారాష్ట్రలో ఇప్పటివరకు మొత్తం 26,37,735 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 23,00,056 మంది కరోనా నుంచి కోలుకోగా, 53,907 మంది మరణించారు. ప్రస్తుతం 2,82,451 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ