మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యూలర్) జాతీయ అధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడకు బెంగళూరు కోర్టు భారీ జరిమానా విధించింది. పదేళ్ల క్రితం నంది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ఎంటర్‌ప్రైజెస్ (ఎన్‌ఐసీఈ) పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పరువు నష్టం కేసులో రూ.2 కోట్లు చెల్లించాలని దేవెగౌడను బెంగళూరు కోర్టు ఆదేశించింది. ముందుగా 2011లో ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్‌ఐసీఈ ప్రాజెక్టుపై దేవెగౌడ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎన్‌ఐసీఈ సంస్థ ప్రతినిధులు దేవెగౌడపై కోర్టులో పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. విచారణ అనంతరం బెంగళూరు సెషన్స్ కోర్టు తాజగా ఎన్‌ఐసీఈ ఆరోపణల్లో నిజం ఉందని తేల్చింది.
ఈ ప్రాజెక్టును కర్ణాటక హైకోర్టు, సుప్రీంకోర్టు తమ తీర్పులలో సమర్థించాయని ముందుగా కోర్టు అభిప్రాయపడింది. ఈ ప్రాజెక్ట్ కర్ణాటక లో పెద్ద ప్రయోజనం కోసం ముడిపడి ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో అలాంటి ప్రాజెక్టుపై ఇలాంటి పరువు నష్టం వ్యాఖ్యలను భవిష్యత్ లో కూడా అనుమతిస్తే, భారీ ప్రయోజనాలతో ప్రజల కోసం చేపట్టే ఇలాంటి ప్రాజెక్టులు ఆలస్యమవుతాయని కోర్టు భావిస్తోందని, ఇటువంటి ప్రకటనలను అరికట్టాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో పరువునష్టం కింద రూ.2 కోట్ల జరిమానా చెల్లించాలని దేవెగౌడకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ