మమతాబెనర్జీ కీలక నిర్ణయం, పశ్చిమ బెంగాల్‌లో జూలై 31 వరకు లాక్‌డౌన్ పొడిగింపు

west bengal cm mamata banerjee, West Bengal Coronavirus, West Bengal Government, West Bengal Government Announces Extension of Lockdown, West Bengal Latest News, west bengal lockdown, west bengal lockdown extension, West Bengal News

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో జూలై 31 వరకూ పశ్చిమ బెంగాల్‌లో లాక్‌డౌన్‌ను పొడిగించాలని ఆమె నిర్ణయించింది. రాష్ట్రంలో కోవిడ్ -19 పరిస్థితిపై మమతా బెనర్జీ ఈ రోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అఖిలపక్ష సమావేశంలో పలు పార్టీల నాయకులు లాక్‌డౌన్‌ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ జూలై చివరి వరకు పలు సడలింపులతో లాక్‌డౌన్ కొనసాగించడానికే మమతా బెనర్జీ మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15,173కి చేరగా, 519 మంది మరణించారు. కాగా బుధవారం నాడు కరోనాకి చికిత్స పొందుతూ టీఎంసీ ఎమ్మెల్యే తమోనాష్ ఘోష్ మరణించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here