తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ హెఛ్ఎండీఏ తలపెట్టిన మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం బి.ఆర్.కె.ఆర్.భవన్‌లో ప్రారంభించారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా హెఛ్ఎండీఏ తరపున 70,000 మట్టి గణేష్ విగ్రహాలను హైదరాబాద్‌లోని 30 ప్రదేశాలలో ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ విగ్రహాల పంపిణీ కార్యక్రమం సెప్టెంబర్ 4 నుండి 10వ తేదీ వరకు హైదరాబాద్ నగరంలో 30 కేంద్రాలలో మరియు 4 మొబైల్ వ్యాన్‌లతో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. 100 కంటే ఎక్కువ విగ్రహాలు అవసరమైన వారు హెఛ్ఎండీఏ కార్యాలయాన్ని సంప్రదించవచ్చునని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మరియుహెఛ్ఎండీఏ కమీషనర్ అర్వింద్ కుమార్, హెఛ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ