తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా 12 మంది పేర్లు సిఫార‌సు

5 Judicial Officers as Telangana High Court Judges, 7 Judicial Officers as Telangana High Court Judges, Mango News, SC Collegium, SC Collegium Recommendation, Supreme Court Collegium, supreme court collegium news today, Supreme Court Collegium Recommends 7 Advocates, Supreme Court Collegium Recommends 7 Advocates 5 Judicial Officers as Telangana High Court Judges, Supreme Court Collegium Recommends 7 Judicial Officers as Telangana High Court Judges, Telangana High Court, Telangana High Court Judges

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం తెలంగాణ హైకోర్టుకు న్యాయమూర్తులుగా(జడ్జిలు) 12 మంది పేర్లను సిఫారసు చేసింది. ఇందులో ఏడుగురు న్యాయవాదులు, ఐదుగురు జ్యుడిషియల్‌ ఆఫీసర్లు ఉన్నారు. ఫిబ్రవరి 1, మంగళవారం నాడు సుప్రీంకోర్టు కొలీజియం సమావేశమై ఈ నియామకాలపై చర్చించింది. ఈ సందర్భంగా ఏడుగురు న్యాయవాదులకు, ఐదుగురు జ్యుడిషియల్‌ ఆఫీసర్లుకు పదోన్నతి కల్పిస్తూ, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా నియామక ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఒక ప్రకటన విడుదల చేసింది.

తెలంగాణ హైకోర్టు జడ్జిలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఏడుగురు న్యాయవాదుల వివరాలు:

  1. కాసోజు సురేందర్
  2. చాడ విజయ భాస్కర్ రెడ్డి
  3. సూరేపల్లి నంద
  4. ముమ్మినేని సుధీర్ కుమార్
  5. జువ్వాడి శ్రీదేవి
  6. మీర్జా సఫివుల్లా బేగ్
  7. నాచ్చరాజు శ్రవణ్ కుమార్ వెంకట్

తెలంగాణ హైకోర్టు జడ్జిలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఐదుగురు జ్యుడిషియల్‌ ఆఫీసర్లు వివరాలు:

  1. జి. అనుపమ చక్రవర్తి
  2. ఎం.జి. ప్రియదర్శిని
  3. సాంబశివరావు నాయుడు
  4. ఎ.సంతోష్ రెడ్డి
  5. డా.డి.నాగార్జున్.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ