ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 28, గురువారం అస్సాం రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా గురువారం ఉదయం 11:00 గంటలకు కర్బీ అంగ్లాంగ్ జిల్లాలోని డిఫు వద్ద ‘శాంతి, ఐక్యత మరియు అభివృద్ధి ర్యాలీ’ లో ప్రధాని ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా విద్యారంగంలో పలు ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత, మధ్యాహ్నం 01:45 గంటలకు ప్రధాని మోదీ డిబ్రూఘర్ లోని అస్సాం మెడికల్ కాలేజీ వద్దకు చేరుకుని, డిబ్రూఘర్ క్యాన్సర్ ఆసుపత్రిని జాతికి అంకితం చేస్తారు.
అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు డిబ్రూఘర్‌లోని ఖనికర్ మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు. ఆ సందర్భంగా మరో ఆరు క్యాన్సర్ ఆసుపత్రులను జాతికి అంకితం చేయడంతో పాటుగా మరో ఏడు కొత్త క్యాన్సర్ ఆసుపత్రులకు శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా అస్సాంలో దాదాపు రూ.1150 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్న 2950 కంటే ఎక్కువ అమృత్ సరోవర్ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ