మహారాష్ట్రలో రాజకీయ గందరగోళం మధ్య అధికార కూటమి ‘మహా వికాస్ అఘాడి’కి మరో షాక్ తగిలింది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. దీంతో ఈరోజు నిర్వహించాల్సిన కీలకమైన కేబినెట్ భేటీ వాయిదాపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక గౌహతిలో రెబెల్ నేత, మంత్రి ఏక్నాథ్ షిండే తనతో శివసేనకు చెందిన 40 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలుపుతున్నారని ప్రకటించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మరోవైపు శివసేన ముఖ్యనేత, ఎంపీ సంజయ్ రౌత్ కూడా రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసే దిశగా రాష్ట్రం వెళుతోందని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీకి సిఫారసు చేయవచ్చని ఎంపి సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల మధ్య సీఎం ఉద్ధవ్ ఠాక్రే కరోనా బారిన పడ్డారన్న వార్త రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. దీనిపై కాంగ్రెస్ మహారాష్ట్ర పరిశీలకుడు కమల్ నాథ్ స్పందిస్తూ.. బుధవారం జరిగే కేబినెట్ సమావేశానికి ముందు ఉద్ధవ్ ఠాక్రేను కలవాల్సి ఉందని, అయితే ఆయనకు కోవిడ్-19 పాజిటివ్‌గా తేలడంతో సమావేశం రద్దు చేయబడిందని చెప్పారు. కాగా మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ కూడా కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన తర్వాత దక్షిణ ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారని అధికార వర్గాలు పేర్కొన్నట్లుగా వార్తలొస్తున్నాయి. అయితే దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY