ఓల్డ్ సిటీ బోనాల కోసం 70 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టాం: మంత్రి తలసాని శ్రీనివాస్

Talasani Srinivas Yadav held Review Meeting with Officials on the Arrangements for Old City Bonalu, Minister Talasani Srinivas Yadav held Review Meeting with Officials on the Arrangements for Old City Bonalu, Telangana Minister Talasani Srinivas Yadav held Review Meeting with Officials on the Arrangements for Old City Bonalu, Talasani Srinivas Yadav held Review Meeting with Officials on the Arrangements for Old City Bonalu, Review Meeting with Officials on the Arrangements for Old City Bonalu, Arrangements for Old City Bonalu, Old City Bonalu, Review Meeting with Officials, Old City Bonalu Arrangements, Telangana Minister Talasani Srinivas Yadav, Minister Talasani Srinivas Yadav, Talasani Srinivas Yadav, Telangana Minister, Old City Bonalu News, Old City Bonalu Latest News, Old City Bonalu Latest Updates, Old City Bonalu Live Updates, Mango News, Mango News Telugu,

ఓల్డ్ సిటీ బోనాల కోసం 70 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఈ నెల 24న జరిగే బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై శుక్రవారం సాలార్జింగ్ మ్యూజియంలో వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే తెలంగాణ పండుగలను విశ్వవ్యాప్తంగా జరుపుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండుగగా బోనాల ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. బోనాల సందర్భంగా వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా, ప్రభుత్వం బోనాల నిర్వహణ కోసం 15 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. 26 దేవాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పిస్తామని తెలిపారు. ప్రజలు సంతోషంగా ఉండాలి, గొప్పగా పండుగలు జరుపుకోవాలనేది ముఖ్యమంత్రి అభిమతం అన్నారు. ఓల్డ్ సిటీ బోనాల సందర్భంగా చేపట్టిన పనులు ఈ నెల 15 వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆలయాల పరిధిలో ఎక్కడ కూడా సీవరేజ్ లీకేజీలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అంబారీపై ఊరేగింపు ఏర్పాట్లు కూడా ప్రభుత్వమే చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఊరేగింపు సందర్భంగా ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చెట్ల కొమ్మలను తొలగించడం, విద్యుత్ తీగలను సరిచేయడం వంటి పనులు వెంటనే చేపట్టాలని చెప్పారు.

భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ డైవర్షన్ కు చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను మంత్రి ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. భక్తులకు అందించేందుకు వాటర్ వర్క్స్ ఆధ్వర్యంలో 2 లక్షల వాటర్ ప్యాకెట్ లను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు ఉత్సవాలను వీక్షించే విధంగా పలు ఆలయాల వద్ద ఎల్ఈడీ స్క్రీన్ లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా దమయంతి భవన్, ఢిల్లీ దర్వాజ వద్ద త్రీడీ మ్యాప్ లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కమిటీ సభ్యులు పలు సమస్యలను సమావేశం దృష్టికి తీసుకు రాగా, తక్షణమే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని ఆదేశించారు. ఎక్కడ రోడ్లపై చెత్త, చెదారాలు లేకుండా చూడాలని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన ప్రాంతాలలో డస్ట్ బిన్ లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ముందుగా ఈరోజు మరణించిన లాల్ దర్వాజ దేవాలయం మాజీ చైర్మన్ మహేష్ మృతికి 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఈ సమావేశంలో ఉమ్మడి దేవాలయాల కమిటీ చైర్మన్ రాకేష్ తివారీ, జోనల్ కమిషనర్ లు సామ్రాట్ అశోక్, రవి కిరణ్, పోలీసు అధికారులు సహా పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 12 =