ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. దేశంలోని పాఠశాలల అభివృద్ధి కోసం ‘పీఎం-శ్రీ’ పథకాన్ని ప్రకటించారు. ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎం-శ్రీ) యోజన కింద భారతదేశ వ్యాప్తంగా 14,500 పాఠశాలల అభివృద్ధి మరియు అప్‌గ్రేడ్ చేయనున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
“సెప్టెంబర్ 5, ఉపాధ్యాయుల దినోత్సవం నాడు ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎం-శ్రీ) యోజన కింద భారతదేశం అంతటా 14,500 పాఠశాలల అభివృద్ధి మరియు అప్‌గ్రేడేషన్ కోసం ఒక కొత్త చొరవను ప్రకటిస్తునందుకు నేను సంతోషిస్తున్నాను. ఇవి జాతీయ విద్యా విధానం యొక్క పూర్తి స్ఫూర్తిని నింపే మోడల్ పాఠశాలలుగా మారుతాయి. పీఎం-శ్రీ పాఠశాలలు విద్యను అందించడానికి ఆధునిక, పరివర్తన మరియు సంపూర్ణ పద్ధతిని కలిగి ఉంటాయి. డిస్కవరీ ఓరియెంటెడ్, లెర్నింగ్ సెంట్రిక్ టీచింగ్‌కి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. లేటెస్ట్ టెక్నాలజీ, స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, స్పోర్ట్స్ మరియు మరిన్నింటితో సహా ఆధునిక ఇన్‌ఫ్రాపై కూడా దృష్టి కేంద్రీకరించబడుతుంది. జాతీయ విద్యా విధానం ఇటీవలి సంవత్సరాలలో విద్యా రంగాన్ని మార్చేసింది. పీఎం-శ్రీ పాఠశాలలు జాతీయ విద్యా విధానం స్ఫూర్తితో భారతదేశంలోని లక్షలాది మంది విద్యార్థులకు మరింత ప్రయోజనం చేకూరుస్తాయని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY