ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఈడీ దాడులు

Delhi Liquor Scam ED Conducts Raids Over 30 Locations Across The Country Including Hyderabad, Delhi Excise Scam, ED Raids 30 Locations Across India, Delhi Excise Policy Case, Delhi Liquor Scam, Mango News, Mango News Telugu, ED Conducts Raids Over 30 Locations , Delhi Excise Policy case, ED Raids 30 Locations Pan-India, ED Raids In Multiple LOcations, Delhi Liquor Scam ED Raids, Delhi Liquor Scam Latest News And Updates

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ షూరూ చేసింది. అయితే ఈ వ్యవహారంలో ఇప్పటికే ఒకవైపు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కూడా విచారణ చేస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఈడీ కూడా రంగంలోకి దిగటం గమనార్హం. మంగళవారం దేశంలోని పలు నగరాల్లో ఏకకాలంలో 30కి పైగా ప్రాంతాల్లో ఈడీ దాడులు చేసింది. ఢిల్లీ, లక్నో, గురుగావ్‌, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో విస్తృత సోదాలు చేపట్టింది. ఈ మేరకు సోదాలు నిర్వహిస్తున్న విషయాన్ని ఈడీ ప్రధాన కార్యాలయ వర్గాలు అధికారికంగా ధృవీకరించాయి.

ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఆరు ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు చేపట్టింది. ఈ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్‌కు చెందిన లిక్కర్ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లై సహా మరో అయిదుగురికి సంబంధించిన కంపెనీలపై ఈడీ అధికారులు దాడులు చేశారు. వారి ఇళ్ళు, కార్యాలయాలలో సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా రామచంద్రన్‌ పిళ్లై, రాబిన్‌ డిస్టిలర్స్‌ ద్వారా బెంగళూరుతోపాటు హైదరాబాద్‌లో వ్యాపార కార్యాకలాపాలు కొనసాగిస్తున్నారు. రామచంద్రన్‌తో పాటు బోయినపల్లి అభిషేక్ రావ్, సూదిని సృజన్ రెడ్డి, గండ్రప్రేమ్ సాగర్ నివాసాలు, కార్యాలయాలపై కూడా ఈడీ దాడులు చేసింది. ఢిల్లీలో దొరికిన కొన్ని కీలక ఆధారాల మూలంగా వీరిపై దాడులు చేస్తున్నట్లు ఏజెన్సీ వర్గాలు తెలిపాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + ten =