హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈనెల 10నుంచి రాత్రి గం.11 వరకు వేళలు పొడిగింపు

Hyderabad Metro Rail MD NVS Reddy Announces Train Timings Extended upto 11 pm From Oct 10th, Hyderabad Metro Rail MD NVS Reddy, Hyderabad Metro Train Timings Extended, Metro Train Timings upto 11 pm From Oct 10th, Mango News, Mango News Telugu, Hyderabad Metro Rail, Hyderabad Metro Timings Extended , Hyderabad Metro Timings upto 11 pm , Metro Timings Extended upto 11 pm From Oct 10th, Metro Timings, Hyderabad Metro Rail Timings, Hyderabad Metro Rail Latest News And Updates

హైదరాబాద్ మెట్రో.. ప్రయాణికులకు గుడ్ న్యూస్ వినిపించింది. మెట్రో రైలు సర్వీస్ వేళలను పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈనెల 10వ తేదీ నుంచి రైలు సర్వీస్ వేళల్లో మార్పులు చేస్తున్నట్లు వెల్లడించింది. ఆరోజు నుంచి చివరి ట్రైన్ రాత్రి గం.11లకు బయలుదేరనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. ప్రయాణికుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. దీనిని గురించి ఆయన ట్విట్టర్‌లో తెలియజేశారు.

’10 అక్టోబర్ 2022 (సోమవారం) నుండి హైదరాబాద్ మెట్రో రైలు సర్వీస్ వేళలను పొడిగిస్తున్నట్లు తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము. దీంతో ఇకపై రోజువారీ సర్వీసులను సాధారణ ఉదయం 6 గంటలకు ప్రారంభిస్తూ, చివరి రైలు సంబంధిత టెర్మినల్ స్టేషన్ల నుండి రాత్రి గం.11లకు బయలుదేరుతుంది’ అని ట్విట్టర్‌లో ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. కాగా ఇప్పటివరకు రాత్రి గం.10:15 ని.లకు టర్మినల్ స్టేషన్ల నుంచి చివరి ట్రైన్ బయలుదేరుతుండగా, ఇకపై రాత్రి గం.11లకు బయలు దేరనుంది. ఉదయం వేళల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. యథావిధిగా ఉదయం గం.6లకు అన్ని రైళ్లు బయలుదేరుతాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + three =