జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైన ‘విశాఖ గర్జన’ ర్యాలీ.. పాల్గొన్న పలువురు వైఎస్సార్సీపీ నేతలు

JAC Leads Visakha Garjana Rally Starts in Grand Way Many YSRCP Leaders and Cadre Participates, Many YSRCP Leaders and Cadre Participates, Visakha Garjana Rally, JAC Leads Visakha Garjana Rally Starts in Grand Way, JAC Visakha Garjana Rally, YSRCP Leaders, YSRCP Cadre, Visakha Garjana rally on October 15, Visakhapatnam, Visakha Garjana Rally News, Visakha Garjana Rally Latest News And Updates, Visakha Garjana Rally Live Updates, Mango News, Mango News Telugu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రాజధానుల వికేంద్రీకరణ అభివృద్ధి నినాదానికి అనుకూలంగా రాజకీయేతర జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సభ్యులు శనివారం నగరంలో ‘విశాఖ గర్జన‘ ర్యాలీ ప్రారంభించారు. దీనికి మద్దతుగా పలువురు వైఎస్సార్సీపీ నాయకులు.. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. అలాగే ఈ ర్యాలీకి వైఎస్సార్సీపీ శ్రేణులతో పాటు ప్రజలు, విద్యార్థులు భారీగా హాజరయ్యారు. కాగా ఒకవైపు అమరావతిని రాష్ట్రానికి ఏకైక రాజధానిగా చేయాలని డిమాండ్ చేస్తూ రైతుల మహా పాదయాత్ర ఉత్తరాంధ్ర వైపు సాగుతున్న తరుణంలో.. మూడు రాజధానుల ప్రతిపాదనకు మద్దతుగా జేఏసీ సభ్యులు ఈ కౌంటర్ ర్యాలీ చేపట్టడం గమనార్హం. మంత్రి గుడివాడ అమరనాథ్, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు.

ఇక నగరంలో వర్షం పడుతున్న నేపథ్యంలో.. ర్యాలీ ఆపేది లేదని, ఎట్టిపరిస్థితుల్లో కొనసాగుతుందని విశాఖ జేఏసీ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ హనుమంతు లజపతి రాయ్ మాట్లాడుతూ.. ఈ ర్యాలీ ఎల్‌ఐసీ భవనం వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహం నుంచి ప్రారంభమై 3.5 కిలోమీటర్ల మేర కొనసాగి బీచ్‌ రోడ్డులోని పార్క్‌ హోటల్‌ సమీపంలోని వైఎస్‌ఆర్‌ విగ్రహం వద్ద ముగుస్తుందని, అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నామని తెలిపారు. ఇక విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేయాలనే ఏకైక డిమాండ్‌తో గర్జన నిర్వహిస్తున్నామని, అందుకే ఈ ప్రాంత వాసులు ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని ఉత్తరాంధ్ర ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. అలాగే మహిళా సంఘాలు, రైతులు మరియు ఉద్యోగులు కూడా పాల్గొనాలని లజపతి రాయ్ కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY