బీజేపీ నాయకుడు, మాజీ తెలుగు దేశం పార్టీ నేత సుజనా సత్యనారాయణ చౌదరికి పెద్ద కష్టమే వచ్చిందంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. ఎందుకంటే ఏపీలో త్వరలో రానున్న ఎన్నికల్లో.. సుజనా చౌదరి పార్లమెంటు ఎన్నికల కోసం బరిలో దిగాలని అనుకుంటున్నారట. అది కూడా విజయవాడ నియోజక వర్గం నుంచే ఆయన పోటీ చేయాలని భావిస్తుండడమే ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం సుజనా చౌదరి భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ఒకవేళ కొద్ది రోజులుగా చర్చ జరుగుతున్నట్లే ఏపీలో టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ పొత్తు పెట్టుకుంటే మాత్రం.. ఈ సీటులో కూటమి అభ్యర్ధిగా తాను నిలబడటానికి సుజనా ప్రయత్నిస్తు న్నారు. కానీ, ఫుల్ డిమాండ్ ఉన్న బెజవాడ సీటును ఇవ్వడానికి టీడీపీ ఒప్పుకుంటుందా అన్నదే ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మిగిలింది.
ఈ విషయంపై చర్చించడానికి బుధవారం తెల్లవారు జామున విజయవాడలోని ఓ ప్రముఖ నేత ఇంట్లో సుజనా చౌదరి టీడీపీ నాయకులతో భేటీ కూడా అయ్యారు. తన సీటు విషయంపై జగ్గయ్యపేట నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ రామ్ తాతయ్య, ఆయన సోదరులు, సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు, పశ్చిమ నియోజకవర్గం జలీల్ ఖాన్, బుద్ధా వెంకన్నతో పాటు కొంతమంది ముఖ్య నేతలతో సుజనా చౌదరి చర్చించారు.
విజయవాడ పార్లమెంట్ సీటును బీజేపీ నుంచి ఆశిస్తున్నానని..టీడీపీ కూటమితో బీజేపీతో కలిస్తే టికెట్ కోరుతానని ఆ నేతలతో సుజనా చౌదరి చెప్పారు. దీనికి వారంతా సహకరించాలని అభ్యర్థించారు. కానీ సుజనా ఎంత తాపత్రాయపడినా ఆయనకు టికెట్ ఇవ్వడం సాధ్యం కాదనేది స్థానిక నేతల అభిప్రాయం. మరోవైపు..బెజవాడలో ఆల్రెడీ.. కేశినేని శివనాథ్ అంటే కేశినాని సోదరుడు కేశినేని చిన్ని ఉన్నారు. ఆయన టీడీపీ తరఫున కార్యక్రమాలు కూడా చేసుకుంటూ దూసుకు పోతున్నారు.
రెండేళ్ల నుంచి కూడా టీడీపీ సిట్టింగ్ ఎంపీ కేశినేని నానితో అధిష్టానానికి పొసగకపోవడంతో.. కేశినేని చిన్నిని ఎంకరేజ్ చేసుకుంటూ వస్తోంది. చిన్ని కూడా టీడీపీ అధిష్టానం అవసరాలు తీరుస్తూ వస్తున్నారు. ఇప్పుడు వీరిందరి మధ్య ఓ బాండింగ్ కూడా ఏర్పడింది . ఇలాంటి సమయంలో అనూహ్య పరిణామాల మధ్య సుజనా చౌదరి తెరమీదికి రావడం.. టీడీపీ నేతలందరినీ కలిసి మంతనాలు జరపడంతో బెజవాడ రాజకీయాలు ఆసక్తి కరంగా మారాయి.
ఇటు బీజేపీ,టీడీపీ పొత్తు విషయం ఇంకా తేలనేలేదు. పొత్తుల విషయం క్లారిటీ వచ్చిన తర్వాతే టీడీపీ అభ్యర్థుల విషయంపై క్లారిటీ వస్తుంది. అయితే టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ ఉంటే సుజనా చౌదరి విజయవాడ నుంచి పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ..చిన్నిని కాదని బెజవాడ సీటును ఇచ్చే పరిస్థితి ఉంటుందా ? అనేదే ఇప్పుడు ప్రశ్న. ఇప్పటికే విజయవాడ పార్లమెంట్, గుంటూరు పార్లమెంట్, వైజాగ్ పార్లమెంట్ స్థానాలపై చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చేశారు దీంతో సుజనా బెజవాడ సీటును కోరడం కోరి సంకటం తెచ్చుకున్నట్లే అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE