అధికారం దక్కించుకోకపోతే ఇక అంతే సంగతులా?

YCP win,Jagan,YS Jagan, Chandrababu, Pawan Kalyan, YCP, TDP, get the power,assembly elections,Andhra Pradesh News Updates, AP Political News, AP Politics, AP Elections,Mango News Telugu,Mango News
YCP win,Jagan,YS Jagan, Chandrababu, Pawan Kalyan, YCP, TDP, get the power

మరి కొద్ది రోజుల్లో రాబోతున్న ఎన్నికల్లో వైసీపీ,టీడీపీ-జనసేన కూటమి అధికారం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు అయితే ఈ ఎన్నికలను ప్రెస్టేజ్ ఇష్యూగా కాదు..  తన చావో రేవో అన్నంత కసిగా తీసుకుంటున్నారు. ఆరు నూరైనా సరే ఎట్టి పరిస్థితిలోనూ  టీడీపీ కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి శత విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఇప్పటి వరకూ వ్యతిరేకిస్తూ వచ్చిన బీజేపీతో కూడా ఈ ఎన్నికల కోసం కలిసి నడవడానికి  కూడా సిద్ధం అయిపోయారు. దీనిలో భాగంగానే..జనసేనతోనూ  చేతులు కలిపి సీట్లను కూడా పంచుకుంటూ రాజకీయ వ్యూహాన్ని  అమలు పరుస్తున్నారు.

ఇటు వైఎస్సార్సీపీ అధినేత జగన్  కూడా దాదాపు ఇదే పరిస్థితిని ఫేస్ చేస్తున్నారు. సీఎం జగన్ మరోసారి  కూడా తమ పార్టీయే అధికారంలోకి రావడం చాలా అంటే చాలా అవసరం అన్న భావనలో ఉన్నారు .అయితే తాను చేసిన సంక్షేమ పథకాలే తనను కాపాడుతాయన్న నమ్మకంతో జగన్ అడుగులు వేస్తున్నారు. వైసీపీతో ఎవరూ  పొత్తులు పెట్టుకోవడానికి రాకపోయినా.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఎప్పటిలాగే అవగాహన కుదుర్చుకుని ముందుకు సాగుతుందనే వాదన వినిపిస్తోంది.

అయితే ఈ రెండు పార్టీలలో ఏది ఇప్పుడు అధికారంలోకి వస్తుందనే చర్చ రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున సాగుతోంది. కొంతమంది ఈసారి టీడీపీ,జనసేన కూటమే విజయం సాధిస్తుందని అంటుంటే.. మరికొంతమంది మాత్రం మళ్లీ జగనే వస్తారంటూ చర్చించుకుంటున్నారు.

ఇలాంటి ప్రశ్నలు, అనుమానాలు వైరల్ అవుతుండగానే.. మరోవైపు ఈ ఎన్నికలలో జగన్ పరాజయం పాలయితే ఏం జరుగుతుంది? చంద్రబాబు ఓడిపోతే  ఏం జరుగుతుంది ? అనే చర్చ కూడా అదే రేంజ్‌లో  జరుగుతోంది.  అయితే ఈ ఎన్నికలు జగన్‌కు, చంద్రబాబుకు కూడా అగ్ని పరీక్షే. ఎందుకంటే ఈ ఎన్నికలే ఈ ఇద్దరి  రాజకీయ భవిష్యత్తును డిసైడ్ చేసేది ఈ ఎన్నికలే కాబట్టి.   జగన్ కనుక ఈ ఎన్నికల్లో బలమైన ఎంపీ సీట్లను కనుక దక్కించుకోక పోతే.. అది వైసీపీ పైనే కాదు.. వ్యక్తిగతంగా జగన్ మోహన్ రెడ్డిపై ఇప్పటి వరకూ నమోదైన కేసులపైన కూడా ప్రభావం చూపిస్తుంది. అలాగే ఎమ్మెల్యేలను కూడా గెలిపించుకోలేక ఓడిపోతే.. టీడీపీ అధికారంలోకి వస్తే.. అరెస్టులు, కేసులు వంటి సీన్లు భారీ ఎత్తున చూడాల్సిన పరిస్థితి వస్తుంది.

మరోవైపు ఈ ఎన్నికలలో టీడీపీ ఓడిపోయి చంద్రబాబు కనుక అధికారంలోకి రాకపోతే.. తెలుగు దేశం పార్టీ కనుమరుగవడం ఖాయమనే చర్చ సాగుతోంది. ఎందుకంటే లోకేష్‌కు చంద్రబాబుకు ఉన్న ఓపిక,సహనం లేవు. చంద్రబాబుకు ఆరోగ్య రీత్యా ఉన్న సమస్యలతో  ఎలాంటి అధికారం లేకుండా క్షేత్రస్థాయిలో మరో ఐదేళ్లపాటు పార్టీని కాపాడుకోవడం కత్తి మీద సాములాంటిదే అన్న వాదన వినిపిస్తోంది. నారా లోకేష్  టీడీపీ  కోసం ఎంత ప్రయత్నించినా.. ఆయనను నమ్మి.. లోకేష్‌తో కలిసి వచ్చే నేతలు ఎంత మంది ఉన్నారనేది ఇప్పుడు ప్రశ్న. మొత్తంగా రెండు పార్టీలకు కూడా.. ఈ ఎన్నికలు ఒక అగ్ని పరీక్షలాగా నిలబడ్డాయని చెప్పొచ్చు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 3 =