
ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు జరుగుతోన్న పోలింగ్‌లో కొన్ని చోట్ల ఘర్షణ వాతావరణం కొనసాగగా..మొత్తంగా ప్రశాంతంగానే పోలింగ్ కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో చెదురుముదురు సంఘటనలు జరిగినా కూడా ఓటింగ్ సరళిపై ఎటువంటి ప్రభావం చూపలేదు. ముఖ్యంగా యువకులు, మొదటిసారి ఓటు వేసే వారు ఈసారి పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
దీంతో మధ్యాహ్నం 1 గంట వరకు 40.20 శాతం పోలింగ్ నమోదవగా.. 3 గంటల వరకు 55.49 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇందులో చిత్తూరుజిల్లాలో ఎక్కువ శాతం 61.94% పోలింగ్ నమోదు కాగా.. అత్యల్పంగా విశాఖ జిల్లాలో 46.01 శాతం నమోదైంది. దీనికి తోడు ఉదయం నుంచి వర్షం పడటంతో విశాఖ సిటీ ఓటర్లు ఓటేయడానికి అంతగా ఆసక్తి చూపనట్లు తెలుస్తోంది.
జిల్లాల వారిగా చూసుకుంటే..అల్లూరి జిల్లాలో 48.87 శాతం,అనకాపల్లిలో 53.45 శాతం,అనంతపురంలో 54.25 శాతం, అన్నమయ్య జిల్లాలో 54.44 శాతం,బాపట్లలో 59.49 శాతం, చిత్తూరు జిల్లాలో 61.94 శాతం,కోనసీమ జిల్లాలో 59.73 శాతం,తూర్పుగోదావరి జిల్లాలో 52.32 శాతం,ఏలూరు జిల్లాలో 57.11 శాతం,గుంటూరు జిల్లాలో 52.24 శాతం,కాకినాడ జిల్లాలో 52, 69 శాతం,కృష్ణాజిల్లాలో 59.39 శాతం,కర్నూలు జిల్లాలో 52.26 శాతం,నంద్యాల జిల్లా 59.30 శాతం,ఎన్టీఆర్ జిల్లాలో చూసుకుంటే 55.71 శాతం, పల్నాడులో 56.48 శాతం, మన్యంలో 51.75 శాతం నమోదయింది
ప్రకాశం జిల్లాలో చూస్తే 59.95 శాతం,నెల్లూరు జిల్లాలో 58.14 శాతం,సత్యసాయి జిల్లాలో 57.56 శాతం,శ్రీకాకుళం జిల్లాలో 54.87 శాతం,తిరుపతిలో 54.42 శాతం,విశాఖ జిల్లాలో 46. 01 శాతం,విజయనగరం జిల్లాలో 54. 31 శాతం,పశ్చిమ గోదావరి జిల్లాలో 54.60 శాతం, కడపజిల్లాలో 60.57 శాతం పోలింగ్ నమోదైంది. అలాగే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన మూడు నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగియగా క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేయడానికి అధికారులు అవకాశాన్ని కల్పించారు. మొత్తంగా అరకులో 51.08శాతం, పాడేరులో 40.12 శాతం,రంపచోడవరంలో 65.33 శాతం నమోదయింది. అయితే 2019 ఎన్నికలతో పోలిస్తే.. ఈ ఎన్నికలలో ఎక్కువ శాతం ఓట్లు నమోదయినట్లు అధికారులు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY