
చాలామంది బరువు తగ్గడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వివిధ రకాల డైటింగ్లు చేస్తూ , ఎక్సర్సైజులు చేస్తూ బాడీని తగ్గించుకోవడానికి కష్టపడుతుంటారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి పోషకాహారం చాలా ముఖ్యం. అయితే బరువు తగ్గాలనుకున్న వాళ్లు ఒక నెల పాటు అన్నం తినడం మానేయమని చెప్పే మాటలు వింటూ ఉంటాము. ఎందుకంటే అన్నం తినడం మానేస్తే ఆ తేడా కొద్ది రోజుల్లోనే తెలుస్తుందని అంటారు. నిజమే బియ్యం వేగంగా కేలరీలను పెంచుతుందన్న మాట వాస్తవమేనని నిపుణులు అంటున్నారు. అన్నం జీవక్రియను నెమ్మదిస్తుంది. దీనివల్ల పొట్ట కొవ్వు, ఊబకాయం పెరిగిపోతుందని చెబుతున్నారు.
ఎక్కువ కార్బోహైడ్రేట్లను మనం తీసుకున్నప్పుడు, వాటిని జీర్ణం చేయడానికి బాడీకి ఎక్కువ చక్కెర అవసరం పడుతుంది. దీని వల్ల మన రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. శరీరంలో ఇలా రక్తంలో చక్కెర స్థాయి పెరగడం వల్ల మధుమేహం సమస్య ఎక్కువ అవుతుంది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులకు షుగర్ లెవల్స్ పెరిగే సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తుంది. థైరాయిడ్ , పీసీఓడీ రోగులకు కూడా ఇది మంచిది కాదు. అనారోగ్యంతో బాధపడేవారు ఎవరైనా సరే.. శరీరంలోని రక్తం షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయడానికి బియ్యం తీసుకోవడాన్ని తగ్గించాలి. ఒక్క మధుమేహ వ్యాధి గ్రస్తులు తప్ప మిగిలిన వాళ్లు పూర్తిగా మానేయక్కరలేదు.
ఎందుకంటే అన్నంలో ఉండే కార్బోహైడ్రేట్లు.. శరీరానికి శక్తిని అందించడానికి చాలా అవసరం పడతాయి. దీన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల మన శరీరాన్ని బలహీనపరుస్తుంది. తగినన్ని కార్బోహైడ్రేట్లు లేక కండరాలు బలహీనపడతాయి. శరీరంలోని పోషకాలు కొరత ఏర్పడుతుంది. అందుకే బరువు తగ్గాలనుకున్నవాళ్లకు శరీరంలోని కొవ్వును తగ్గించడమే లక్ష్యం కావాలి. కండరాలను బలహీనపరచ కూడదు. అందుకే బియ్యం ఉత్పత్తులను పూర్తిగా మానేయడం కంటే..మితంగా తింటే మంచిదని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY