
ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల మార్పులు ఏర్పడి, రోజురోజుకూ వాతావరణం వేడెక్కుతోంది. దీంతో వేసవిలో వాతావరణం వేడెక్కి వలస పక్షులకు ప్రాణాంతకంగా మారుతోంది. ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వలస వెళ్తుండగానే..ఆ హీట్‌వేవ్‌ను తట్టుకోలేక ఎన్నో పక్షులు మృత్యువాత పడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. నిజానికి ప్రతి వేసవిలో మిలియన్ల కొద్దీ పక్షులు హీట్ వేవ్ నుంచి తమను తాము రక్షించుకోవడానికి చల్లటి ప్రదేశాలకు ఎగిరిపోతుండటం సహజంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ఏడాది తీవ్రంగా మారిన వాతావరణ మార్పులతో ప్రయాణిస్తున్నప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
వాతావరణ మార్పుల వల్ల కొన్ని పక్షులు ఉత్తరం నుంచి దక్షిణం వైపు వలసలు పోగా, మరికొన్ని తూర్పు నుంచి పడమర వైపు వలస వెళ్తున్నాయి. రిచర్డ్ పిపిట్స్ సాంగ్‌బర్డ్స్ వంటి చాలా రకాల పక్షులు సైబీరియా నుంచి యూరప్‌లోకి వలసలు పోతున్నాయి. ఇక్కడి వేడి వాతావరణంతోపాటు ఆగ్నేయ ఆసియాలో పట్టణీకరణ పెరిగిపోవడం, అడవులు, జలాశయాలు, బహిరంగ మైదానాలు వంటివి తగ్గిపోవడంతో పక్షులు వలసపోవడానికి ప్రయత్నించడం..మధ్యలోనే చనిపోవడం వంటివి జరుగుతున్నట్లు అధ్యయనంలో తేలింది.
లక్షలాది కిలోమీటర్లు ఎగురుతూ ప్రయాణించే పక్షులు..వాతావరణంలో కలిగే మార్పులను ఎదుర్కొంటాయి. అయితే ఇటీవల పెరుగుతున్న హీట్‌వేవ్‌ను కొన్ని పక్షులు తట్టుకోలేక మధ్యలోనే మృత్యువాత పడినట్లు జార్జ్‌టౌన్ యూనివర్సిటీ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ అండ్ సస్టైనబిలిటీ నిపుణుల అధ్యయనంలో తెలిపారు. కొన్ని పక్షిజాతులు వలసల్లో భాగంగా ప్రయాణిస్తుండగా మధ్య మధ్యలో ఒక్కసారిగా మారుతున్న వాతావరణం, వేడిగాలులకు చనిపోగా మరికొన్ని పక్షులు తగిన ఆహారం, నీరు దొరకకపోవడంతో చనిపోతున్నాయి. మరికొన్ని పక్షులు మాత్రం బాగా అలసిపోయి చనిపోతున్నాయి.
వాతావరణం వేడెక్కడం వల్ల వలస పక్షులను ఇది ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి .. కెనడా, కరేబియన్ మధ్య వలస వెళ్లే చిన్న చిన్న సాంగ్ బర్డ్స్ తో పాటు అమెరికన్ రెడ్‌స్టార్ట్ పక్షులను పరిశోధకులు పరిశీలించారు. దీనికోసం వారు ఆటోమేటెడ్ రేడియో ట్రాకింగ్, ‘లైట్- లెవల్ ట్యాగ్’ల వంటి అత్యాధునిక పరికరాలను ఉపయోగించారు. దీంతో పాటు కొన్నేళ్లుగా వివిధ దేశాలకు సంబంధించిన పక్షుల మైగ్రేషన్ డేటాను కూడా ఎనలైజ్ చేశారు. దీని ప్రకారం వేడి వాతావరణం పక్షుల నివాసంతో పాటు ఆహార లభ్యతపై కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తున్నట్లు గుర్తించారు.
మొత్తంగా గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ వల్ల ఈ పరిస్థితిలో వాతావరణంలో కొంత మార్పు కనిపిస్తోందని.. దీంతో వలస పక్షులు వేడి వాతావరణాన్ని తట్టుకోలేక చనిపోతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఆయా పరిస్థితులకు తగినట్లుగా చాలా పక్షులు జీవించగలుగుతున్నా.. వేసవిలో పెరుగుతున్న వేడి వల్ల చాలా పక్షులు చనిపోతున్నట్లు గుర్తించారు. మొత్తంగా దాదాపు ఆరు శాతం వరకు పక్షుల మనుగడ రేటు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయని అంచనా వేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY