వాహన రిజిస్ట్రేషన్‌ మార్క్‌ మార్పుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

TG Instead Of TS On Vehicle Number Plates, TG Instead Of TS, Vehicle Number Plates, Number Plates Changed, Telangana, Center Green Signal, Change Of Vehicle Registration Mark, TG Vehicle Number Plates, TG Replaces TS, Number Plate Registration, TS Registration New Rules, Telangana, TS Live Updates, Mango News, Mango News Telugu
Telangana,TG instead of TS on vehicle number plates,Center green signal,change of vehicle registration mark, TG vehicle number plates

తెలంగాణలోకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్‌ రెడ్డి సర్కార్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు. దీనిలో భాగంగానే తెలంగాణ వాహనాల నెంబర్‌ ప్లేట్ల మీద ఇప్పటి వరకూ ఉన్న టీఎస్‌‌కు బదులుగా టీజీగా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటికే ఈ విషయంపై  తెలంగాణ ప్రభుత్వం గెజిట్‌ కూడా విడుదల చేసింది. దీనిపై మార్చి 15వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లను కూడా ప్రారంభించారు. అయితే  తెలంగాణప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం గురువారం రాత్రి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో తెలంగాణలో వాహనాలకు నెంబర్‌ ప్లేట్లపై టీఎస్‌  ను టీజీగా మార్చేందుకు కేంద్ర ఓకే చెప్పినట్లు అయింది.

తెలంగాణ కోడ్..ఇకపై టీజీ ఉండే విధంగా కేంద్ర ఉపరితల రవాణా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక నుంచి తెలంగాణలోని వాహికల్స్ నంబర్ ప్లేట్లపై టీఎస్ స్థానంలో టీజీ వచ్చే విధంగా రిజిస్ట్రేషన్ చేయాలని కేంద్రం తెలిపింది. కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. సీరియల్ నంబర్ 29A కింద,టీఎస్‌కు బదులుగా టీజీగా మార్చింది.

దీనికి ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గం తీర్మానం చేసి.. దీనిని కేంద్రానికి పంపింది. మార్చి 12న కేంద్రం గెజిట్ నోటిఫికేషన్‌ను రిలీజ్  చేసింది. మోటారు వెహికల్ చట్టం 1988లోని సెక్షన్‌ 41(6) కింద ఉన్న అధికారాన్ని ఉపయోగించి 1989 జూన్‌ 12వ తేదీన అప్పటి ఉపరితల రవాణా శాఖ జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌లో ఈ మార్పులు చేసినట్లు  కేంద్రం తెలిపింది. ఆ నోటిఫికేషన్‌లోని టేబుల్‌లో సీరియల్‌ నంబర్‌ 29ఏ కింద తెలంగాణకి ఇప్పటి  వరకు ఉన్న టీఎస్‌ స్థానంలో ఇప్పుడు టీజీని కేటాయించినట్లు చెప్పింది.

ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టాక.. వాహన రిజిస్ట్రేషన్‌ మార్క్‌లో మార్పు చేయాలని నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ ప్రభుత్వం తమ పార్టీ అందరికీ గుర్తుండాలనే ఉద్దేశంతోనే.. టీజీని కాకుండా టీఎస్‌గా నిర్ణయించిందని కానీ ఇప్పుడు దానిని మార్చాలని తెలంగాణ కేబినేట్‌ తీర్మానం చేసింది.  తాజాగా  కేంద్రం ఉపరితల రవాణా శాఖ నోటిఫికేషన్ రిలీజ్ చేసి.. పూర్తిస్థాయి అనుమతులు ఇవ్వడంతో.. ఇకపై రిజిస్టర్‌ అయ్యే వెహికల్స్ మార్క్‌ టీజీగా ఉండనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY