మూడు పార్టీలకు కీలకంగా ఈ ఎన్నికలు

This Election Is Crucial For All Three Parties: This Election Is Crucial For All Three Parties,Election Is Crucial For All Three Parties,Crucial For All Three Parties,Political Parties, Gujjula Premender Reddy, Rakesh Reddy, Tinmar Mallanna, Whose Side Are The Graduates,Telanagana State,Telanaga Party,Lok Sabha Election 2024,Lok Sabha Election,Assembly Elections,Political News,TS Live Updates,BRS, Congress,,BJP
Whose side are the graduates, election, Congress, Tinmar Mallanna, BRS, Rakesh Reddy, BJP, Gujjula Premender Reddy

పట్టభద్రుల ఉప ఎన్నిక తెలంగాణలోని అన్ని పార్టీలకు కీలకంగా మారిపోయింది. ప్రచారానికి మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండడంతో అధికార పార్టీ కాంగ్రెస్‌తో పాటు, బీజేపీ, బీఆర్ఎస్ కూడా  ప్రచారంలో స్పీడ్‌ను పెంచాయి.

అధికారంలోకి వచ్చాక తాము చేపట్టిన ఉద్యోగ నియామకాలు, ఉద్యోగ సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ నేతలు వివరిస్తూ ముందుకు వెళుతున్నారు. ఇటు ఈ  తొమ్మిదిన్నరేళ్లలో తాము తెలంగాణ రాష్ట్రానికి చేసిన సంక్షేమాన్ని బీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ..కాషాయపార్టీ నేతలు  ముందుకెళ్తున్నాయి. అయితే ఈ ఉప ఎన్నికల మూడు పార్టీలకు కీలకం కావడంతో..  పట్టభద్రులు ఎవరివైపు నిలుస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఈ ఎమ్మెల్సీ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున తీన్మార్ మల్లన్న బరిలో దిగగా, బీఆర్ఎస్ పార్టీ నుంచి రాకేష్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. వీరితో పాటు ఆయా పార్టీ నేతలంతా మూడు ఉమ్మడి జిల్లాల్లో విస్తృత ప్రచారాన్ని చేస్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి  వచ్చాక చేపట్టిన అభివృద్ధి, 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు, తెలంగాణ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్, 200 యూనిట్లలోపు ఫ్రీ కరెంటు గురించి కాంగ్రెస్ నేతలు వివరిస్తు ఓటర్లను ఆకట్టుకునే పడ్డారు.

మరోవైపు బీఆర్ఎస్ నేతలయితే తాము ఈ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగ కల్పన, పరిశ్రమల స్థాపన తదితర అంశాలను చెబుతూనే.. ఆరునెలల్లోనే కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ ముందుకు వెళుతున్నారు.  అటు కేంద్రంలో చేపట్టిన అభివృద్ధి, రాష్ట్రానికి ఇచ్చిన నిధులు కేటాయింపు తదితరఅంశాలతో బీజేపీ ప్రచారం చేస్తున్నది.

ఖమ్మం,నల్లగొండ, వరంగల్ మూడు ఉమ్మడి జిల్లాల్లో 4 లక్షల61వేల 806 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు. వరంగల్‌లో 1 లక్షా,72వేల524, నల్లగొండలో 1 లక్షా,65వేల778, ఖమ్మంలో  1 లక్షా 23వేల 504 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. వీరిలో నిరుద్యోగులే ఎక్కువ మంది ఉండగా..ఉద్యోగ, ఉపాధ్యాయులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక్కడి నుంచి స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీలో  ఉన్నా.. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే ప్రధానంగా పోటీ ఉంది. అయితే ఈ పట్టభద్రులంతా..మూడు పార్టీల పైన గుర్రుగానే ఉన్నట్లు  చర్చ జరుగుతున్నది.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు అయినా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోవడంతో పాటు,  నోటిఫికేషన్లు  జారీ చేయకపోవడమే కాకుండా నిరుద్యోగ భృతి కూడా ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు.  ఇటు పీఆర్సీపై ఉద్యోగులు  అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అయినా  ఇచ్చిన హామీ ప్రకారం 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేయలేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. అలాగే  తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో టీఎస్పీఎస్సీ అక్రమాలు, ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని.. నిరుద్యోగులు, 317 జీఓ తీసుకురావడం పట్ల ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి వారంతా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేస్తారనేదే హాట్ టాపిక్‌గా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY