చిరంజీవి, నాగార్జునలకు ప్రధాని మోదీ అభినందనలు

Chiranjeevi, Chiranjeevi Coronavirus Awareness Video, Chiranjeevi On Coronavirus Awareness, Coronavirus Awareness, Modi Appreciates Chiranjeevi and Nagarjuna, Nagarjuna, Nagarjuna Coronavirus Awareness, Nagarjuna Coronavirus Awareness Video, Nagarjuna On Coronavirus, Narendra Modi Appreciates Chiranjeevi, PM Modi, Prime Minister Narendra Modi, Sai Dharam Teja, Varun Tej

ప్రస్తుతం ప్రపంచవ్యాపంగా పలు దేశాలను కోవిడ్-19 (కరోనా వైరస్) వణికిస్తున్న సంగతి తెలిసిందే. భారత్ లో కూడా కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2902 కు చేరగా, ఈ వైరస్ వలన ఇప్పటివరకు 68 మంది మరణించారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో 164 కరోనా కేసులు నమోదు కాగా, తెలంగాణలో 229 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ పై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగా ప్రముఖ సినీ హీరోలు చిరంజీవి, నాగార్జునలు యువ కథానాయకులు సాయి ధరమ్ తేజ్, వరుణ్‌ తేజ్‌ తో కలిసి ప్రముఖ సంగీత దర్శకుడు కోటి సార‌థ్యంలో ఒక పాటను రూపొంచించి విడుదల చేశారు. ఈ వీడియోసాంగ్ కు సోషల్ మీడియాలో మంచి స్పందన వచ్చింది. కాగా ఈ వీడియో సాంగ్ ను డిడి న్యూస్ ఏప్రిల్ 2వ తేదీన ట్వీట్ చేసింది.

ఈ క్రమంలో ఈ వీడియో సాంగ్ పై ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌లో స్పందించారు. ” చిరంజీవి, నాగార్జున, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ కి మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి నా ధన్యవాదాలు. అందరం మన ఇళ్లల్లోనే ఉందాం. అందరం సామాజిక దూరం పాటిద్దాం. కరోనా వైరస్ పై విజయం సాధిద్దాం” అంటూ తెలుగులో ట్వీట్‌ చేశారు. ప్రధాని అభినందనపై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ ” దేశంలో కరోనా నియంత్రణకు మీరు చేస్తున్న కృషిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము. మా వంతు సాయంగా మేము కూడా ఈ పనిలో భాగస్వామ్యులమయ్యామని” పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు కోటి కి అందరి తరుపున చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − nine =