ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విధ్వంసాలకు చెందిన దృశ్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఎన్నికల సంఘం ఆదేశాలతో ఏర్పాటైన ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) అందించిన నివేదిక ద్వారా సంచలన అంశాలు, దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. నేరుగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి మాచర్ల ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి చేసిన అరాచకం తాలూకు వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఆ వీడియో చూస్తుంటే.. మరీ అంత అరాచకమా అనిపించకమానదు.
పోలింగ్ రోజున, ఆ తర్వాత జరిగిన ఇలాంటి హింసకు చెందిన దృశ్యాలను సిట్ చాలానే సేకరించింది. సాక్ష్యాలు, ఆధారాలతో సహా డీజీపీకి నివేదిక అందించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో పల్నాడు జిల్లాలో అల్లర్లు, అరాచకాలు పెద్ద ఎత్తున చోటుచేసుకున్నాయి. అయితే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరులు పోలింగ్ రోజున సృష్టించిన అరాచకానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఎన్నికల్లో గెలిచేందుకు ప్రత్యర్థులపై పిన్నెల్లి సోదరులు, అనుచరులు పెద్ద ఎత్తున దాడులకు పాల్పడ్డారని టీడీపీ మొదటి నుంచీ ఆరోపిస్తూ వస్తోంది. పోలీసులు కూడా వారికి అడ్డుచెప్పలేదని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు పిన్నెల్లికి సంబంధించి మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలింగ్ రోజున స్వయంగా ఈవీఎంను ఎమ్మెల్యే పిన్నెల్లి ధ్వంసం చేశారు. పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలోని ఈవీఎంను పిన్నెల్లి పగలగొట్టారు. పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు సీసీ టీవీల్లో రికార్డు అయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనను ఎన్నికల కమిషన్, పోలీసులు సీరియస్‌గా తీసుకొని పిన్నెల్లిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY