మే 13న ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ ఇతర ప్రాంతాల్లో పోలింగ్ జరిగినప్పటికీ.. ఏపీ హాట్ టాపిక్ గా మారింది. హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడమే అందుకు కారణం. కౌంటింగ్ రోజున అలాంటి ఉద్రిక్తతలకు చాన్స్ లేకుండా ఈసీ అప్రమత్తమైంది. భారీ ఎత్తున బలగాలను మోహపరించేసింది. అటెన్షన్ ఏపీ.. అనే సందేశాన్ని ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని 33 ప్రాంతాల్లో 375 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం 8గంటలకు పోస్టల్ బ్యాలెట్‌తో కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 8:30కి ఈవీఎమ్స్ కౌంటింగ్ ప్రారంభంకానుంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఓట్ల కౌంటింగ్‌కు 350 హాల్స్ ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు 75 హాల్స్ ఏర్పాటు చేశారు. అభ్యర్థుల సమక్షంలో ఇవాళ ఎన్నికల అధికారులు స్ట్రాంగ్ రూమ్స్‌ను తెరవనున్నారు. అనంతరం పోస్టల్ బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రాలకు తరలించనున్నారు.
కౌంటింగ్ కేంద్రాల దగ్గర మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేయడంతోపాటు.. మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు బంద్ చేయనున్నారు. అయితే.. కొన్ని జిల్లాల్లో ఎల్లుండి వరకు మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. ఫలితాల ప్రకటన తర్వాత ఊరేగింపులు, ర్యాలీలకు ఈసీ అనుమతి నిరాకరించింది. పోలింగ్ రోజున ఆ తర్వాత తలెత్తిన హింసాత్మక ఘటనలకు ఇక తావు లేకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరు ఏమాత్రం గీత దాటినా వేటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఏపీ పోలీసులతో పాటు సెంట్రల్ ఫోర్స్ రంగంలోకి దిగింది. ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక స్ట్రైకింగ్ ఫోర్స్‌లు ఏర్పాటు చేశారు.
ఎన్నికల పోలింగ్ అనంతరం జరిగిన హింసతో ఏపీవ్యాప్తంగా పెద్దఎత్తున కేంద్ర బలగాల మోహరించారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్భంధీగా చర్యలు చేపట్టారు. ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక స్ట్రైకింగ్ ఫోర్స్‌లు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నారు. అంతేకాకుండా.. సీఎం జగన్, చంద్రబాబు నివాసాలు, పార్టీల ఆఫీసుల దగ్గర భద్రత పెంచారు. ఏపీవ్యాప్తంగా కొనసాగుతున్న కార్డన్ సెర్చ్ నిర్వహించి.. రౌడీషీటర్ల బైండోవర్, పలువురిపై నగర బహిష్కరణ వేటు వేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ తర్వాత కూడా 20 కంపెనీల బలగాలతో భద్రతను ఏర్పాటు చేశారు. పోలింగ్ రోజున జరిగిన అల్లర్లు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. దీనిపై ఈసీ సీరియస్ గా దృష్టి సారించింది.
దాదాపు 90 వేల మంది రేపు పోలీసు పహారా కాయనున్నారు. సుమారు 60వేల మంది సివిల్ పోలీసులను… 8వేల మంది సాయుధ బలగాలను… మరో 20వేల మంది సిబ్బందిని రంగంలోకి దించింది. 45వేల 960మంది ఏపీ స్టేట్ పోలీసులకు తోడుగా 3500మంది కర్నాటక పోలీసులు, 4500మంది తమిళనాడు పోలీసులు రేపు బందోబస్తులో ఉండనున్నారు. అలాగే, 1622మంది హోంగార్డులు, 3366మంది ఇతర పోలీస్ సిబ్బంది కౌంటింగ్ సెక్యూరిటీ విధుల్లో ఉంటారు. వీళ్లకు తోడుగా మరో 18,609మందిని మోహరించింది ఈసీ. ఇందులో 3010మంది ఎన్‌సీసీ, 13వేల739మంది ఎన్‌ఎస్‌ఎస్ సిబ్బంది, 1614మంది ఎక్స్ సర్వీస్‌మెన్, 246మంది రిటైర్డ్ పోలీస్ సిబ్బంది విధుల్లో ఉంటారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY