ఎప్పుడయితే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్ధిగా నిలబడతానని ప్రకటించారో అప్పటి నుంచీ ఏపీ రాజకీయాలు ఎన్నడూ లేనంతగా వార్తల్లో నిలుస్తూ వచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ టాక్ ఆఫ్ ది నేషన్ అయిపోయారు. ఇక జూన్ 4 ఎన్నికల ఫలితాల తర్వాత అయితే పవన్ కళ్యాణ్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అసలు తాను 21 అసెంబ్లీ సీట్లతో పాటు 2 పార్లమెంట్ సీట్లను సొంతం చేసుకోవడంతో పాటు.. టీడీపీకి ఇంతటి భారీ విజయాన్ని అందించడం వెనుక పవన్ కళ్యాణ్ ఆలోచనా శక్తి, ఆయన పట్టుదలే కారణమంటూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.
జగన్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబును, చంద్రబాబు ఫ్యామిలీని ఎంతగా ఇబ్బంది పెట్టారో అందరికీ తెలిసిందే. చివరకు స్కిల్ డెవల్మెంట్ స్కామ్‌లో చంద్రబాబును జైలులో పెట్టించి మరీ కక్షను తీర్చుకున్నారు మాజీ సీఎం జగన్. కానీ ఎప్పుడయితే పవన్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి తన మద్దతును ప్రకటించి కూటమిగా ఎన్నికలలో పోటీ చేస్తామన్నారో అప్పటి నుంచీ ఏపీ రాజకీయాలు యూ టర్న్ తీసుకున్నాయి. అంతే కాదు ఏపీలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వెనుక పవన్ కళ్యాణ్ వ్యూహం మాత్రమే ఉందని రాజకీయ విశ్లేషకులు సైతం పవన్‌ను స్ట్రాటజీని మెచ్చకుంటున్నారు.
అంతేకాకుండా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో బాగా తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ కావడమే అతని జీవితంలో కలిసి వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. చాలా సందర్బాల్లో ఆవేశాన్ని చూపించినా.. అవసరమైన సందర్భాల్లో ఓర్పును ప్రదర్శిస్తూ ఏపీ రాజకీయాల్లో తన పేరు మారుమ్రోగేలా చేయడంలో పవన్ అందకే సక్సెస్ అయ్యారని అంటున్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమిస్తూ సత్తా చాటే విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారంటున్నారు.
నిజమే ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంతో… రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ 2014లో జనసేన పేరుతో సొంత పార్టీని స్థాపించారు. 2019 ఎన్నికలలో పరాజయాన్ని మూటకట్టుకున్నా.. ఎక్కడా నిరుత్సాపడకుండా జనాల్లో మమేకం అయ్యారు.ఎన్నో ఆపద సమయాల్లో ప్రభుత్వం పట్టించుకోకవపోయినా తానున్నానంటూ సొంత డబ్బులను ఖర్చు పెట్టారు. అదే జనాల్లో ఆయన స్థానాన్ని పదిల పరిచేలా చేసింది. అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని చాలా సందర్భాల్లో చెప్పిన పవన్ అలా చేయడంలో ఎంత తగ్గాలో అంతేకంటే ఎక్కువగా తగ్గి పొలిటికల్ గా సక్సెస్ అయ్యారు. ఏపీలో 164 స్థానాల్లో కూటమి విజయం సాధించడానికి.. పవన్ కళ్యాణ్ పడిన కష్టం అంతా చూస్తూనే ఉన్నారు. 21 స్థానాల్లోనే జనసేన పోటీ చేసినా పవన్ కళ్యాణ్ అంచనాలను మించి ఫలితాలను సాధించారనే చెప్పొచ్చు. మొత్తంగా పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టాలని కలలు కన్న ఆయన అభిమానుల తమ కల నిజం అయినందుకు సంతోషిస్తున్నారు. అయితే ఈ విజయంతోనే పవన్ ఆగిపోరని.. ఇంకా సినీ, రాజకీయ రంగాల్లో ఎంతో విజయాలను సాధించాలని జనసైనికులు కోరుకుంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY