కార్పోరేటర్ స్థాయి నుంచి కేంద్రమంత్రిగా ఎదిగారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తన మార్క్ చూపించారు. పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో కొత్త ఉత్సహాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలో బీజేపీని పరుగులు పెట్టించారు. పార్టీ పట్ల ఆయనుకున్న నిబద్ధత వల్ల ఆయన్ను కేంద్ర మంత్రి పదవి వరించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించారు. బాల్యం నుంచే బండి సంజయ్ స్వయం సేవక్ సంఘ్‌లో స్వయం సేవకుడిగా పనిచేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌లో పట్టణ కన్వీనర్, పట్టణ ఉపాధ్యక్షునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత కరీంనగర్ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌లో 1994-1999, 1999-2003 మధ్య రెండు పర్యాయాలు డైరెక్టర్‌గా పని చేశారు. అలాగే మాజీ ప్రధాని ఎల్‌కే అడ్వానీ చేపట్టిన సురాజ్ రథ యాత్రలో 35 రోజులు వెహికల్ ఇంఛార్జిగా కూడా పనిచేశారు.
2005లో మొదటిసారి కరీంనగర్‌లోని 48న డివిజన్ నుంచి బీజేపీ తరుపున కార్పోరేటర్‌గా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2010లో కూడా అదే డివిజన్ నుంచి మరోసారి కార్పోరేటర్‌గా విజయం సాధించారు. 2019 ఓబీసీ వెల్ఫేర్ పార్లమెంట్ కమిటీ మెంబర్, అర్బన్ డెవలప్మెంట్ పార్లమెంట్ కమిటీ మెంబర్, టొబాకో బోర్డు మెంబర్‌గా నియామకం అయ్యారు. ఇక 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనకు బిజేపీ ఎంపీ టికెట్ ఇచ్చింది. కరీంనగర్ పార్లమెంట్ నుంచి బండి సంజయ్ ఎంపీగా పోటీ చేసి.. 96 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత ఏడాదికి ఆయన్ను బీజేపీ హైకమాండ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమించింది. మూడేళ్ల పాటు టి.బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ పనిచేశారు. 2023లో అధ్యక్ష పదవి నుంచి హైకమాండ్ బండి సంజయ్‌ను తప్పించి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. సంజయ్‌ను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది.
ఇక ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి బండి సంజయ్ కరీంనగర్ నుంచి బీజేపీ తరుపున పోటీ చేశారు. అత్యంత భారీ మెజార్టీతో రెండోసారి గెలుపొందారు. కరీంనగర్‌లో బండి సంజయ్‌కు 2.25 లక్షల ఓట్ల మెజార్టీ దక్కింది. దీంతో బీజేపీ హైకమండ్ బండి సంజయ్‌కు కేంద్ర కేబినెట్‌లో చోటు ఇచ్చింది. ఆదివారం కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన బండి సంజయ్.. సోమవారం బాధ్యతలను స్వీకరించారు. సోమవారం సాయంత్రం బండి సంజయ్‌కు హోం సహాయ శాఖను కేటాయిస్తున్నట్లు రాజ్‌భవన్ నుంచి ప్రకటన వెలువడింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE