ఆ భార్యభర్తలు ఇద్దరు లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగారు. గెలుపే లక్ష్యంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఘన విజయం సాధించారు. భారీ మెజార్టీని దక్కించుకున్నారు. ఇప్పుడు ఆ భార్యభర్తలిద్దరూ అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. వారే సమాజ్ వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, ఆయన భార్య డింపుల్ యాదవ్.
ఎస్పీ వ్యవస్థాపడకుడు ములాయం సింగ్ యాదవ్ మరణంతో మెయిన్ పురి స్థానం ఖాళీ అయింది. దీంతో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మెయిన్ పురి నుంచి అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ పోటీ చేశారు. ఘన విజయం సాధించారు. మొదట డింపుల్ యాదవ్ గెలుపుపై సందేహాలు నెలకొన్నప్పటికీ.. చివరికి అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. యూపీలో అత్యధిక మెజార్టీ సాధించిన ఎస్పీ ఎంపీగా డింపుల్ యాదవ్ మొదటి స్థానంలో నిలిచారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కూడా డింపుల్ యాదవ్ కన్నౌజ్ నుంచి పోటీ చేశారు. కానీ అప్పుడు ఓడిపోయారు. తాజా ఎన్నికల్లో మరోసారి బరిలోకి దిగి విజయ ఢంకా మోగించారు.
ఇక అఖిలేష్ యాదవ్ గత ఎన్నికల్లో తన భార్య డింపుల్ ఓడిన కన్నౌజ్ నుంచి ఈసారి పోటీ చేసి గెలుపొందారు. గత ఎన్నికల్లో అజ్గంఘర్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఎస్పీలో అత్యధిక ఓట్ల మెజార్టీ సాధించి డింపుల్ యాదవ్ మొదటి స్థానంలో ఉండగా.. అఖిలేష్ యాదవ్ రెండో స్థానంలో ఉన్నారు. డింపుల్ యాదవ్ లోక్ సభకు ఎన్నికవడం ఇదే తొలిసారి. కాగా ఇప్పుడు డింపుల్ యాదవ్, అఖిలేష్ యాదవ్ 18వ లోక్ సభలోకి ఎంట్రీ ఇవ్వబోతుండడంతో అందరి దృష్టి వారిపైనే ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE