తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రిగా పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణలో అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ఎన్నికలకు ముందు కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.
అప్పటి నుంచీ తెలంగాణ కాషాయ పార్టీకి సంబంధించిన కొన్ని కీలక సమావేశాలకు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హాజరవుతూ వస్తున్నారు. ఇటీవల కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రాజంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే, నల్లారికి బీజేపీ పెద్దలు ఇప్పుడు తెలంగాణలో ఓ కీలక పదవిని కట్టబెడతారంటూ ఓ ప్రచారం పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తోంది.
రాజకీయాలలో కీలకంగా ఉండే గవర్నర్ పదవిలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఢిల్లీ హైకమాండ్ కూర్చోబెడుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాజకీయాలపై నల్లారికి పూర్తి అవగాహన ఉండటంతో.. ఆయనను తెలంగాణ గవర్నర్‌గా నియమిస్తే తమకు కలిసి వస్తుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం ఉన్న సీపీ రాధాకృష్ణన్.. గవర్నర్ ఇన్‌ఛార్జి మాత్రమే కావడంతో ఇప్పుడు తెలంగాణ గవర్నర్ గా కిరణ్ కుమార్ రెడ్డిని నియమిస్తారానే ప్రచారం ఊపందుకుంది. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా కోరుకున్నప్పుడు దానిని వ్యతిరేకించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని..ఇప్పుడు తెలంగాణకు గవర్నర్‌గా నియమిస్తే రాజకీయ పార్టీలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి మరి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE