ప్రపంచం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఎన్నో అద్భుతాలు చోటుచేసుకుంటున్నాయి. టెక్నాలజీ ప్రపంచాన్ని ఏలుతోంది. రోజుల తరబడి చేసే పనులు నిమిషాల వ్యవధిలోనే అయిపోతున్నాయి. ప్రపంచం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుంటే.. ఆ వేగానికి బ్రేకులు వేసేందుకు అంతే వేగంగా కొత్త కొత్త మహమ్మారులు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికీ కరోనా వైరస్ ప్రపంచాన్ని పట్టిపీడించింది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి.. మూడేళ్ల పాటు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసింది. కోట్లాది మంది ప్రాణాలను బలితీసుకుంది. మరెంతో మందిని అనాథలను చేసింది. ఆర్థిక వ్యవస్థలను దివాళా తీసింది. ప్రస్తుతం ఆ మహమ్మారి పీడ విరగడయిపోయింది. కానీ ఇంతటితో ఆగిపోయిందా అంటే.. కానే కాదు. ఎందుకంటే కరోనాను మించిన వైరస్‌లు పుట్టుకొస్తున్నాయి.
అవును.. కరోనా కంటే వంద రెట్లు డేంజర్ అయిన కొత్త వైరస్‌లు వెలుగులోకి వచ్చాయి. కరోనానే ప్రపంచాన్ని వల్లకాడు చేసింది. దానికంటే మించిన వైరస్ వస్తే ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. తాజాగా జపాన్‌లో మరో కొత్త వైరస్ వెలుగు చూసింది. దాని పేరు స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్. ఆ దేశంలో శరవేగంగా ఈ మహమ్మారి వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు జపాన్‌లో 977 మందికి ఈ బ్యాక్టీరియా సోకింది. జపాన్‌లో ఈ బ్యాక్టీరియా చాపకింద నీరులా విస్తరిస్తోందని.. ఈ ఏడాది చివరి నాటికి 2500 మందికి ఈ బ్యాక్టీరియా సోకే అవకాశాలు ఉన్నాయని జపాన్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ వెల్లడించింది.
ఈ బ్యాక్టీరియా సోకిన వారిలో మరణాల రేటు 30 శాతంగా ఉంది. ఈ మహమ్మారి బారిన పడ్డవారిలో ఎక్కువ మంది 48 గంటల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారని అక్కడి శాస్త్రవేత్తలు వెల్లడించారు. ముఖ్యంగా చిన్న పిల్లలపై ఈ మహమ్మారి ఎక్కువ ప్రభావం చూపుతుందని అన్నారు. ఈ బ్యాక్టీరియా మనిషి శరీర అవయవాలను ధ్వంసం చేస్తుందని.. కండరాల వాపు, స్కిన్ ఇన్‌ఫెక్షన్, బ్లడ్ ప్రెజర్, గుండె పనితీరు, శ్వాసతీసుకోవడం వంటి విషయాల్లో ఇబ్బందులకు గురి చేస్తుందని తెలిపారు. అంతేకాకుండా బ్యాక్టీరియా సోకిన వారిలో కాలేయ సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతున్నాయని వెల్లడించారు. ప్రస్తుతం జపాన్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ బ్యాక్టీరియా పుట్టుక మరియు దానికి వ్యాక్సిన్‌ను తయారు చేసి పనిలో ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE