ఏపీలో అయిదేళ్ల తర్వాత కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు.. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్‌లు బాధ్యతలు స్వీకరించారు. కొత్తగా మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వారు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా ఈనెల 21 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత మొదటిసారి సమావేశాలు జరగనున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్‌గా టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అలాగే డిప్యూటీ స్పీకర్ పదవిని జనసేనకు కేటాయించారు.
ఈక్రమంలో ఏపీ శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్.. టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఫోన్ చేయడం సంచలనంగా మారింది. ఇప్పటికే చంద్రబాబు మంత్రి వర్గంలో చోటు దక్కకపోవడంతో బుచ్చయ్య చౌదరి అలకబూనారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాత అత్యధిక సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన వారి జాబితాలో బుచ్చయ్య చౌదరి ఉన్నారు. ఇప్పటి వరకు ఏడుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ సమయంలో కేశవ్.. బుచ్చయ్య చౌదరికి ఫోన్ చేసి.. ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించాలని కోరారు.
అందుకు బుచ్చయ్య చౌదరి కూడా అంగీకారం తెలిపారు. గురువారం ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేత ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేయించనున్నారు.ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాక.. కొత్తగా అసెంబ్లీకి ఎంపికయిన ఎమ్మెల్యేల చేత బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికను నిర్వహిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE