కోట్లల్లో పెట్టుబడులు పెట్టి, ఎన్నో కంపెనీలు స్థాపించి వేలాది మందికి ఉపాధి కల్పించాల్సిన కోటీశ్వరులైన బిజినెస్ మ్యాన్‌లు భారతదేశాన్ని వీడి ఇతర దేశాలకు వెళ్లిపోతున్నారు. ఈ సంవత్సరం సుమారు 4,300 మంది మిలియనీర్లు భారత్‌ను విడిచిపెట్టి విదేశాలకు వెళ్లబోతున్నట్లు .. హెన్లీ అండ్ పార్టనర్స్ రిపోర్టు-2024 తెలిపింది. మిలియనీర్ల వలసలు ఎక్కువగా ఉన్న దేశాల లిస్టులో చైనా మొదటి స్థానంలో, యూకే రెండు స్థానంలో ఉండగా మూడో స్థానంలో భారత్ నిలవడం ఆలోచించదగ్గ విషయమే.
ఇలా భారతదేశాన్ని వదిలివెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఏక పక్ష నిర్ణయాలేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. భారతదేశంలో నెలకొన్న పరిస్థితులతో పాటు కేంద్రంలోని పదేళ్లుగా ఎన్డీయే ప్రభుత్వం అమలుచేస్తున్న ఏకపక్ష విధానాలు, తీసుకొస్తున్న కొత్త కొత్త నిబంధనల పట్ల విసిగిపోయిన మిలియనీర్లు చివరకు తమ మాతృదేశాన్ని కూడా విడిచిపెట్టి బయటి దేశాలకు వలస వెళ్తున్నట్టు ఆర్థిక నిపుణులు అంటున్నారు. దీంతోపాటు భారతదేశంలో తమ భద్రత, ఆర్థిక పరిస్థితులు, ట్యాక్స్ బెనిఫిట్స్, వ్యాపార అవకాశాలు, పిల్లలకు విద్యావకాశాలు, జీవన ప్రమాణాలను అన్నీ లెక్కలు వేసుకొన్న తర్వాతనే భారతీయ మిలియనీర్లు ఇతర దేశాలకు వలస వెళ్తున్నట్టు హెన్లీ రిపోర్ట్ చేసింది.
గడిచిన మూడేళ్లలో వలసలు వెళ్లిన మొత్తం కోటీశ్వరుల సంఖ్య 18,300గా ఉండగా..ఇండియాలో ఒక్కో మిలియనీర్ పెట్టగలిగే కనీస పెట్టుబడి8.2 కోట్లు అని ఆర్దిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన ఈ మూడేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ నష్టపోయిన మొత్తం1,50,060 కోట్లు ఉంటుందని అంటున్నారు. అలాగే ఈ ఏడాదిలో భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా వలసలకు సిద్ధమైన కోటీశ్వరుల సంఖ్య 1,28,000గా ఉంది. అయితే ఈ మిలియనీర్లుతమ గమ్యస్థానంగా తొలిప్రాధాన్యంగా యూఏఈ కాగా.. రెండో ప్రాధాన్యంగా అమెరికా దేశాన్ని ఎంచుకుంటున్నట్లు హెన్లీ రిపోర్ట్ తేల్చింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE