త్వరలోనే డిజిటల్‌ రూపాయి పైలట్ లాంచ్‌, కాన్సెప్ట్ నోట్‌ను విడుదల చేసిన ఆర్బీఐ

Reserve Bank of India Released Concept Note on Central Bank Digital Currency for India, RBI Releases Concept Note On CBDC, To Soon Launch Pilot Digital Rupee, RBI To Soon Launch Digital Rupee, Mango News, Mango News Telugu, RBI Says E-Rupee Will Bolster India Digital Economy, India Digital Economy, RBI Says E-Rupee , RBI Unveils Features Of Digital Rupee, Digital Rupee Latest News And Updates, RBI To Soon Launch Digital Rupee, Reserve Bank of India, Digital Rupee Concept Note, RBI Latest Press Release, Indian Digital Rupee

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)పై కాన్సెప్ట్ నోట్‌ను విడుదల చేసింది. త్వరలోనే నిర్దిష్ట వినియోగ అవసరాల కోసం దేశంలో డిజిటల్‌ రూపాయి (ఇ-రూపీ)ని పైలట్ లాంచ్‌ చేయనున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. ప్రస్తుతమున్న కరెన్సీ నోట్లకు జతగా డిజిటల్‌ రూపాయి రానుంది. అలాగే ప్రస్తుత పేమెంట్స్ సిస్టమ్ కు ప్రత్యామ్నాయంగా కాకుండా, అదనపు పేమెంట్స్ కు అనుకూలంగా డిజిటల్‌ రూపాయి మారే అవకాశం ఉంది. సాధారణంగా సీబీడీసీ గురించి మరియు డిజిటల్ రూపాయి యొక్క ప్రణాళికాబద్ధమైన లక్షణాల గురించి అవగాహన కల్పించడమే ఈ కాన్సెప్ట్ నోట్ జారీ చేయడం వెనుక ముఖ్య ఉద్దేశమని ఆర్బీఐ పేర్కొంది. కాన్సెప్ట్ నోట్‌ దేశంలో సీబీడీసీని జారీ చేయడం వల్ల కలిగే లక్ష్యాలు, ఎంపికలు, ప్రయోజనాలు మరియు నష్టాలను వివరిస్తుందని తెలిపారు. అలాగే సీబీడీసీని ప్రవేశపెట్టే విషయంలో ఆర్బీఐ యొక్క విధానాన్ని వివరించడానికి కూడా ప్రయత్నిస్తుందన్నారు.

కాన్సెప్ట్ నోట్ సాంకేతికత మరియు డిజైన్ ఎంపికలు, డిజిటల్ రూపాయి యొక్క సాధ్యమైన ఉపయోగాలు, జారీ చేసే యంత్రాంగాలు మొదలైన కీలక విషయాలను కూడా చర్చిస్తుందని, ఇది బ్యాంకింగ్ వ్యవస్థ, ద్రవ్య విధానం, ఆర్థిక స్థిరత్వంపై సీబీడీసీ ప్రారంభం యొక్క చిక్కులను పరిశీలించి, గోప్యతా సమస్యలను విశ్లేషిస్తుందని తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్ లాంచ్‌లను ప్రారంభించనుందన్నారు. అలాంటి పైలట్ లాంఛ్ ల పరిధి విస్తరిస్తున్న కొద్దీ, డిజిటల్‌ రూపాయి యొక్క నిర్దిష్ట లక్షణాలు మరియు ప్రయోజనాల గురించి ఆర్బీఐ ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేస్తూనే ఉంటుందని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =