
ఆంధ్రప్రదేశ్‌లో తొలి మంత్రివర్గ సమావేశం కాసేపటి క్రితం ప్రారంభం అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న మొదటి కేబినెట్ సమావేశం కావడంతో అందరిలోనూ ఈ మీటింగ్‌పై ఆసక్తి పెరిగిపోయింది. పోలవరం ప్రాజెక్టుతో పాటు ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితిని వైసీపీ ప్రభుత్వం దెబ్బతీసిందని మొదటి నుంచీ చెబుతున్న చంద్రబాబు.. తొలి కేబినెట్ సమావేవంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది చర్చనీయాంశమైంది.
మొదటి కేబినెట్ మీటింగ్‌లో పలు కీలక అంశాలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత స్థితిగతులతో పాటు ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి ఇచ్చిన ఆరు హామీలపైనా ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే ఎనిమిది శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం రెడీ అవుతున్నట్లు సమాచారం. అలాగే ప్రభుత్వ ప్రాధాన్యతలపైన కూడా చంద్రబాబు.. మంత్రులకు దిశా నిర్దేశం చేయనున్నారట. మరోవైపు వైపీనీ ప్రభుత్వ అవినీతిపైన విచారణ చేపట్టే అంశంపైన కూడా ఈ భేటీలో కీలక చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల ప్రచారంలో ఎన్డీయే కూటమి ఇచ్చిన హామీల అమలుపైన ఈ కేబినెట్ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలుపైన కూడా కేబినెట్లో చర్చించే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితిపై ప్రత్యేకంగా మంత్రివర్గం చర్చించనున్నట్టు సమాచారం.
ఇప్పటికే రాష్ట్రానికి ఉన్న అప్పులపై..కూటమి ప్రభుత్వం ఇప్పటికే ప్రాథమిక సమాచారాన్ని తెప్పించుకుంది. రూ.14 లక్షల కోట్లకు పైగా ఆంధ్రప్రదేశ్‌కి అప్పుల భారం ఉన్నట్లు కొత్త ప్రభుత్వానికి సమాచారం వచ్చినట్లుగా అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ అప్పులను వైసీపీ ప్రభుత్వం ఎలా తెచ్చింది.. ఎలా ఖర్చు పెట్టింది? ఆ నిధులన్నీ ఏమైపోయాయన్న విషయాలపై కేబినెట్ మీటింగ్‌లో సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది.
వైసీపీ అధికారంలో ఉన్న ఈ ఐదేళ్లలో ఎప్పుడూ లేనంత విధ్వసం జరిగిందని తెలుగుదేశం పార్టీ, జనసేన నేతలు పదేపదే చెబుతూ వస్తున్నారు. అందుకే ఈ సమావేశంలో గత ప్రభుత్వ విధానాలపైన కూడా చర్చించే అవకాశం ఉంది. అలాగే జూలై నెలలో టీడీపీ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను కూడా ప్రవేశ పెట్టాల్సి ఉంది. దీంతో బడ్జెట్‌కు సంబంధించిన విషయాలపైన కూడా మంత్రులతో చర్చించి చంద్రబాబు ఓ నిర్ణయానికి రానున్నట్లు సమాచారం. మొత్తంగా కేబినెట్ తొలి సమావేశం నుంచి ఎలాంటి నిర్ణయాలొస్తాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY