ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, కరోనా మృతుల అంత్యక్రియలకు 15 వేలు

Andhra Pradesh, AP 15000 for Last Rites Of Covid 19 People, AP CM YS Jagan, AP CM YS Jagan Decides to Give Rs 15000 for Last Rites Of Covid 19 People, AP Coronavirus, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, Coronavirus Live Updates, COVID-19

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూలై 14, మంగళవారం నాడు రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, నివారణ చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై కరోనా మృతుల అంత్యక్రియలకు 15 వేల రూపాయల చొప్పున ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. కరోనాతో ‌మరణించిన వారి అంత్యక్రియల విషయంలో రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో సీఎం‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది.

కరోనా నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ తీసుకున్న కీలక నిర్ణయాలు:

  • కరోనా బాధితులకు ఏ ఆసుపత్రులైనా వైద్యం చేయడానికి నిరాకరిస్తే కఠిన చర్యలు.
  • వైద్యం అందించడానికి నిరాకరిస్తూ, ప్రభుత్వ ఆదేశాలు పాటించకపోతే ఆస్పత్రుల అనుమతులు రద్దు.
  • క్వారంటైన్‌ సెంటర్ల మీద అధికారులు శ్రద్ద పెట్టాలి, వచ్చే వారం రోజులు వాటిపై స్పెషల్ డ్రైవ్‌ చేపట్టాలి.
  • కోవిడ్‌ కేర్‌ సెంటర్లు, క్వారంటైన్‌ కేంద్రాల వద్ద ఫిర్యాదుల స్వీకరణకు కాల్‌ సెంటర్‌ నంబర్‌తో హోర్డింగ్‌ ఏర్పాటు చేయాలి.
  • కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లో ప్రత్యేక బస్సులను వినియోగించి పరీక్షల నిర్వహణ.
  • అవసరాలకు అనుగుణంగా 17 వేలకు పైగా డాక్టర్లు, 12 వేలకు పైగా నర్సుల సేవలు పొందేందుకు అధికారులు రూపొందించిన ప్రణాళికకు అంగీకారం.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + five =