ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవవనరుల శాఖల మంత్రి నారా లోకేష్ బాధ్యతలు చేపట్టారు. సోమవారం వెలగపూడి సచివాలయంలోని నాలుక బ్లాక్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఉదయం సచివాలయానికి చేరుకున్న లోకేష్‌కు వేదపండితులు మంత్రోచ్ఛారణలతో స్వాగతం పలికారు. ఆ తర్వాత 4 బ్లాక్‌లో ఉన్న తన ఛాంబర్లో లోకేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత మంత్రిా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత పలు పైళ్లను లోకేష్ పరిశీలించారు. ఎన్నికలవేళ ఇచ్చిన మాట ప్రకారం మెగా డీఎస్సీ విధివిధానాలకు సంబంధించిన ఫైలుపై తొలి సంకతం చేశారు. ఆ తర్వాత ఆ ఫైల్‌ను కేబినెట్‌కు పంపించారు.
ఇటీవల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక 16,347 పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. ఇప్పుడు అదే ఫైల్‌కు సంబంధించి విధివిధానాలు రూపొందించి కేబినెట్ ముందు పెడుతూ నారా లోకేష్ తొలి సంకం చేశరు. నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పలువురు సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆయనకు అభినందలు తెలియజేశారు.
ఇకపోతే 2019లో జరిగిన ఎన్నికల్లో మంగళగిరి నుంచి నారా లోకేష్ పోటీ చేసి ఓడిపోయారు. ఈక్రమంలో ఓడిన చోటే గెలిచి తీరాలన్న కసితో లోకేష్ మరోసారి మంగళగిరి నుంచి పోటీ చేశారు. గతంలో ఎప్పుడు కూడా మంగళగిరిలో టీడీపీ అభ్యర్థి పోటీ చేయలేదు. అటువంటి స్థానం నుంచి నారా లోకేష్ రెండోసారి పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. చంద్రబాబు నాయుడు కేబినెట్లో ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవవనరుల శాఖ మంత్రిగా చోటు దక్కించుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY