మీకో న్యాయం జనసేనకో న్యాయమా ?

YCP Jabardast Politics,Jabardast,Politics,YCP Jabardast Politics,Pawan Kalyan,Janasena Party,Hyper Aadi,Pithapuram,YCP,Janasena,TDP,BJP,Chandrababu,Hyper Aadi,Janasena,Pithapuram,TDP,Telugu News,Mango News,Mango News Telugu,Elections 2024,AP Elections 2024,AP Polls,AP Politics,AP News,AP Latest News,AP Elections News,AP Elections,AP Assembly Elections 2024,Hyper Aadi Latest News,Hyper Aadi Janasena Campaign,Aadi,Hyper Aadi Speech,Hyper Aadi About JanaSena,Hyper Aadi Interview,YSRCP

ఒక్కోసారి ఎదుటవారి మీద బురద చల్లాలని ప్రయత్నిస్తే అది తిరిగి తమ మీదే పడుతుంది. అచ్చంగా అలాగే ఇప్పుడు జగనసేన పార్టీ మీద విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలు తెలియకుండానే తమ గోతిని తామే తవ్వుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు వచ్చినప్పుడు  ప్రతీ రాజకీయ పార్టీ స్టార్ క్యాంపెయినర్లను ఏర్పాటు చేసుకుంటుంది. అయితే తమ పార్టీకి ఎవర్ని స్టార్ క్యాంపెయినర్లుగా నియమించాలనే విషయంపై  ఆయా పార్టీలు, లోతుగా అధ్యయనం చేసి మరీ ఓ నిర్ణయానికి వస్తాయి.

ఎక్కువగా సినీ, టీవీ ఇండస్ట్రీకి చెందిన  ప్రముఖులను స్టార్ క్యాంపెయినర్లుగా  రాజకీయ పార్టీలు ఎంచుకుంటాయి. సినీ ప్రముఖుల్ని క్రౌడ్ పుల్లర్స్‌గా అంతా చూస్తారు. వాళ్లని చూడటానికి జనాలు  ఎగబడతారు. అందుకే తమ మొదటి ప్రయారిటీ వారికే ఇస్తారు. అందుకే జనసేన తమ స్టార్ క్యాంపెయినర్లుగా వీరిని ఎంచుకుంది. దీనిపైనే ఇప్పుడు వైసీపీ సెటైర్లు వేస్తుంది.

జనసేన పార్టీ కోసం చాలా కాలంగా పని చేస్తున్నాడు జబర్ధస్ద్ టీమ్ మెంబర్, కమెడియన్ హైపర్ ఆది. హైపర్ ఆదితో పాటు చాలా మంది సినీ నటులు, జనసేనతో ఉండటం.. గత ఎన్నికల్లో కూడా చూశాం. హైపర్ ఆది జబర్ధస్ట్ స్కిట్ లోనే కాదు, రాజకీయాల్లోనూ అదిరిపోయే పంచ్ డైలాగులు పేల్చుతూ ఉంటాడు.  హైపర్ ఆది, గెటప్ శ్రీను వంటి కొంతమంది  తాజాగా జనసేన స్టార్ క్యాంపెయినర్స్ లిస్టులో చోటు దక్కడంతో వైసీపీ నేతలు సెటైర్లు వేయడం స్టార్ట్ చేశారు. రాజకీయాల్ని జబర్దస్త్ స్కిట్‌గా మార్చేశారంటూ జనసేన మీద సెటైర్లు వేస్తున్నారు

దీంతో వైసీపీ నేతలను నెటిజన్లు, జనసైనికులు   సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం షురూ చేశారు. సాక్షాత్తూ సీనియర్ హీరోయిన్.. వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి  ఆర్కే రోజా ఒకప్పుడు జబర్దస్త్ కామెడీ షోకి నాగబాబుతో కలిసి జడ్జిగా వ్యవహరించారు.అలాగే జబర్దస్త్‌లో లేడీ గెటప్స్ వేసే కొంతమంది మేల్ ఆర్టిస్టులు.. గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో  ఎన్నికల ప్రచారంలో, పాదయాత్రలో కూడా సందడి చేశారు.

వైఎస్సార్సీపీ..అప్పుడు జబర్దస్త్ నటులతో ప్రచారం చేయిస్తే తప్పు లేదు గానీ, ఇప్పుడు జనసేన పార్టీ ఆ పని చేస్తే తప్పెలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. ఇదెక్కడి న్యాయమో మీరే చెప్పండంటూ సోషల్ మీడియాలో పాత వీడియోల్ని తిరగతోడుతూ  మరీ  వైసీపీ నేతలను ట్రోల్ చేస్తున్నారు. దీంతో జబర్థస్త్ కౌంటర్ బూమ్ ర్యాంగ్ లా తిరిగి తమ మెడకే చుట్టుకుందంటూ వైసీపీ శ్రేణులంతా కామ్ అయిపోయారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − eight =