
ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా కల్కి 2898 ఏడి మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. భారీ ఎక్సప్టేషన్స్ మధ్య ఈ సినిమా జూన్ 27న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. నాగ్ అశ్విన్ డైరక్షన్ వహిస్తున్న ఈ మూవీపై బజ్ ఓ రేంజ్‌లో ఉంది. ఇటు ఈ మూవీ ఓపెనింగ్ కలెక్షన్స్ కూడా రికార్డు స్థాయిలోనే ఉండటంతో ప్రభాస్ అభిమానులు సంతోషంతో ఎగిరి గంతేస్తున్నారు. తాజాగా ఈ మూవీ అడ్వాన్స్ టికెట్ బుకింగ్ ఓపెన్ అవగా.. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
ఈ మూవీ టికెట్ రేట్లను పెంచడం కోసం మూవీ ప్రొడ్యూసర్ అండ్ డైరక్టర్..ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల నుంచి పర్మిషన్ తీసుకున్న సంగతి తెలిసిందే. కల్కి మూవీ కోసం ఒక్కో టికెట్ మీద సింగిల్ స్క్రీన్ కోసం రూ. 75, మల్టీప్లెక్స్‌లో మూవీ చూడటానికి రూ. 100 ఎక్సట్రాగా చార్జ్ చేస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే కల్కి ఒక టికెట్ ధర మల్టీప్లెక్స్ లో రూ. 413 కాగా, సింగిల్ స్క్రీన్ లో రూ. 265గా ఉంది. ఏపీ, తెలంగాణలో కూడా ఈ భారీ ధరలు అమలు చేస్తున్నారు. ఇక మూవీ త్రీడీలో కూడా విడుదలవుతుండటంతో.. త్రీడీ మూవీ టికెట్ మల్టీప్లెక్స్ అయితే రూ. 495 సింగిల్ స్క్రీన్ లో రూ. 377గా ఉంది. టికెట్ ధరలు భారీగానే పెరిగాయి కాబట్టి.. ఓపెనింగ్ డే కలెక్షన్లు కూడా అదే రేంజ్ లో ఉంటాయని మూవీ టీమ్ ఆశిస్తోంది.
దీపికా పడుకొనే, దిశా పటాని, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీని అశ్వినీ దత్ నిర్మించారు. సంతోష్ నారాయణన్ ఈ మూవీకి మ్యూజిక్‌ను అందించారు. ఇప్పటికే రెండు ట్రైలర్లు మూవీ మీద అంచనాలను భారీగా పెంచేశాయి. అదిరిపోయే విజువల్ ఎఫెక్ట్స్‌తో పాటు ఇంతకుముందు ఎప్పుడూ చూడని పాత్రలో ప్రభాస్‌ను చూడబోతున్నామంటూ ఫ్యాన్స్ చాలా ఖుషీ అవుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY